twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మిస్టర్ ఫర్ ఫెక్ట్’ని ముద్దుగా డార్లింగ్ అంటారా..!

    By Sindhu
    |

    ప్రభాస్ హీరోగా, కాజల్, తాప్సి హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిస్టర్ పెర్ ఫెక్ట్ ' సినిమా ఆడియో వేడుక ఆదివారం సాయంకాలం హైదరాబాదు శివారులోని 'ఆనంద్‌' చిత్రాన్ని చిత్రీకరించిన సిబిఐటి కాలేజీ క్యాంపస్‌లో విద్యార్ధులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్ర బ్యాక్‌డ్రాప్‌ కూడా ఆ కాలేజీలో జరిగింది. యువత ఏదైనా సాధించాలంటే దాన్ని నెరవేర్చేవాడే మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ కథాంశం కాబట్టే ఈ కార్యక్రమాన్ని కాలేజిలో చేయడం జరిగింది. ఈ వేడుకకు బయటనుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. వాళ్ల అరుపులు, కేరింతలతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధంకాలేదు. కార్యక్రమంలో కామెడీ స్కిట్స్ తో బాటు, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాటలు అందరిలోనూ ఉషారుతెచ్చాయి.

    దర్శకుడు వి.వి.వినాయక్, హీరో సిద్ధార్థ్ కలిసి ఆడియో సీడీని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దశరథ్ చెబుతూ, ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తారని అన్నాడు. ప్రభాస్ చెబుతూ, 'అభిమానులు, స్టూడెంట్స్, అందమైన అమ్మాయిల మధ్య ఇలా ఈ వేడుక జరగడం చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమాలో నేను కొత్త లుక్ తో కనిపిస్తాను. అందుకోసం బాడీని తగ్గించి స్లిమ్ గా మారాను. హెయిర్ స్టయిల్ కూడా మార్చాను. దర్శకుడు సినిమాని చాలా స్టైలిష్ గా తీసాడు. ఫ్యామిలీ డ్రామా, లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో సినిమా అందర్నీ అలరిస్తుంది"అన్నాడు. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు.

    English summary
    Telugu movies Rebel Star Prabhas Mr Perfect audio release function will be without hottie Tapsi. Yes, really sad news for all the fan base waiting for Tapsi at the Mr Perfect audio release function. Mr Perfect audio launch function is schedule held at CBIT in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X