జూ ఎన్టీఆర్ లా ప్రభాస్ కి మిస్టర్ ఫర్ ఫెక్ట్ న్యూ ఇమేజ్...!
మన హీరోల ఇమేజ్ లు మార్చేసే పనిలో పడ్డాడిప్పుడు నిర్మాత దిల్ రాజు. హీరోలకు పాత ఇమేజ్ స్థానంలో కొత్త ఇమేజ్ ను తన సినిమాల ద్వారా ఇస్తున్నాడు. ఆ విషయాన్ని ఈరోజు ప్రెస్ మీట్ లో తనే చెప్పాడు. 'ఆమధ్య మేం నిర్మించిన 'బృందావనం' సినిమా ద్వారా యన్టీఆర్ కి కొత్త ఇమేజ్ వచ్చింది. అలాగే 'గగనం' సినిమా ద్వారా నాగార్జున కూడా కొత్త తరహాగా కనిపించారు. ఇప్పుడు ప్రభాస్ కి కూడా ప్రస్తుతం మేం తీస్తున్న 'మిస్టర్ పెర్ ఫెక్ట్' సినిమా కొత్త ఇమేజ్ ని ఇస్తుంది. ఈ చిత్రం కథ అటువంటిది. గత ఏడాది మార్చిలో దీనిని స్టార్ట్ చేసాం. ఇప్పుడు పూర్తవుతోంది' అన్నారు.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 19న హైదరాబాదులోని సీబీఐటీ కాలేజ్ ప్రాంగణంలో జరుగుతుందట. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా కాబట్టి, కాలేజ్ లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నామన్నారు నిర్మాత. ఆరోజు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ ఉంటుందట. దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











