ఊటి నుండి సక్సెస్ గా తిరిగి వచ్చిన 'మిస్టర్ ఫర్ ఫెక్ట్'
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రం ఊటిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సంతోషం ఫేం దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, కె విశ్వనాథ్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్, తాప్సీ లు కథానాయికలుగా నటిస్తున్నారు. 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రం లవ్ కమ్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రస్తుతం ఊటిలో షూటింగ్ పూర్తయింది. తదుపరి కొన్ని సీన్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించనున్నాం. తర్వాత షెడ్యూల్ మలేషియా, ఆస్ట్రేలియా లో వుంటుంది అని నిర్మాత దిల్ రాజు అన్నారు.
ప్రభాస్ కాజల్ తాప్సీ ప్రకాష్ రాజ్ కె విశ్వనాథ్ మిస్టర్ ఫెర్ పెక్ట్ దశరథ్ దిల్ రాజు prabhas kajal tapsi prakash raj k viswanath mr perfect dasarath dil raju


Click it and Unblock the Notifications