twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు నందమూరి-ఇప్పుడు మెగా హీరోల టెన్షన్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్

    By Sindhu
    |

    'ఛత్రపతి"తర్వాత బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్ వంటి సినిమాలు చేసినా ప్రభాస్ కి ఏదీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. బిల్లా పర్వాలేదు అనిపించింది. డార్లింగ్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నిర్మాతను నష్టాల్లోకి నెట్టింది. డార్లింగ్ కన్ ఫర్మ్ హిట్ అని ప్రభాస్ తో సహా యూనిట్ అంతా అనుకున్నప్పటికీ అదే టైమ్ లో బాలకృష్ణ 'సింహా" రిలీజ్ కావడంతో డార్లింగ్ వెనక్కి వెళ్లిపోయింది. డార్లింగ్ గత ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ అవగా, సరిగ్గా సంవత్సరం తర్వాత ఏప్రిల్ 21న ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" విడుదలవుతోంది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ కి గత ఏడాది అనుభవమే రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

    ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ'తీన్ మార్" దానికి కారణం. సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిని కొమరం పులి అభిమానుల్ని నిరాశపరచడం, ఆ వెంటనే స్టార్ట్ అయిన 'తీన్ మార్" ఆరు నెలల్లోనే రిలీజ్ కి రావడం ద్వారా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేయ్యగలిగాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం 'తీన్ మార్" మీదే వుంది.

    మిస్టర్ ఫర్ ఫెక్ట్ మీద వారికి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు అనేది నిజం. దానికి తగ్గట్టుగానే 'తీన్ మార్" పాటలు పెద్ద హిట్ కావడంతో డార్లింగ్ కి వచ్చిన పరిస్థితే 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" కి కూడా రాబోతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి. దాంతో కాస్తా మెగా హీరోల టెన్షన్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్ అంతాడేమోతో వేచి చూడాల్సిందే...

    English summary
    The April fight for BO is not going to be face to face between Junior NTR and Pawan Kalyan. Yes, we do have Rebel Star prabhas entering the competition with ‘Mr. Perfect.’ If news from reliable sources is to be believed Dil Raju is not to step away feared of either ‘Shakti’ or ‘Teen Maar.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X