దిల్ రాజుకు పెద్ద డౌటు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుత తెలుగు సినిమా పరిస్దితి ని వివరిస్తూ.. సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంటే వేడుకలు జరుపుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. ట్రెండ్ మారిపోయింది. యాభై రోజుల వేడుకలే ఉంటాయి. భవిష్యత్తులో శతదినోత్సవాలు ఉండకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నారు. ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్" సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ప్రభాస్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేసినందుకు ఆనందంగా ఉందని, ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ గ్రాసర్ అని దిల్ రాజు చెప్పారు. ప్రభాస్‌తో మా సంస్థ నుంచి విభిన్నమైన చిత్రాన్ని చేయాలనుకొన్నాం. ఇంటిల్లిపాదీ చూసేలా మంచి కథతో సినిమా నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ప్రభాస్ నటించిన చిత్రాల్లోనూ, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లోనూ ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రమిదే.ఇక సిద్దార్దతో ఆయన తాజా చిత్రం 'ఓ మై ఫ్రెండ్' చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు. ఇది మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











