twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ ని అలరిస్తోన్నమిస్టర్ ఫర్ ఫెక్ట్ రేంజ్ పెరిగిపోయింది...!

    By Sindhu
    |

    రిలీజ్ రోజున యావరేజ్ టు అబౌ యావరేజ్ రిపోర్ట్స్ రాబట్టుకున్న మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తియ్యేసరికే హిట్ అని కన్ ఫర్మ్ అయిపోయింది ఫ్యామిలీస్ తో పాటు ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి కూడా పాస్ మార్కులు పడిపోయాయి. ఇక ఈ చిత్రం రేంజ్ పెరగడానికి ఇతర సినిమాల ఫలితాల కూడా దోహదపడుతున్నాయి.

    రెండో వారంలో 'నేను నా రాక్షసి" సినిమాతో ఏ సంటర్ల వరకు పోటీ ఏర్పడుతుందని భావించగా, అలాంటి పరిస్థితి ఎదురుకాదని తేలిపోవడంతో మిస్టర్ ఫర్ ఫెక్ట్ కి ఎదురే లేకుండా పోయింది. రెండో వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ చిత్రం భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ప్రభాస్ కెరీర్ లో పెద్ద హిట్ సినిమా అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. వచ్చే శుక్రవారం విడుదలవుతున్న '100%లవ్" ఈ చిత్రాన్ని ఎంతవరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఒకవేళ ఆ సినిమా కూడా 'నేను నా రాక్షసి" బాటే పడితే కనుక'మిస్టర్ ఫర్ ఫెక్ట్" కి కనీసం మరో రెండు వారాలైనా పోటీ అనేదే ఉండదు...

    ప్రస్తుతం ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'రెబల్'. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క కధానాయికగా నటిస్తోంది. షెడ్యుల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ ఏప్రిల్ 28 నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే, 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా రాయలసీమ విజయయాత్ర కారణంగా రెబల్ షూటింగ్ మే 2 కి వాయిదా పడింది.

    English summary
    Prabhas latest film 'Mr.Perfect' released last week and got super hit talk at Box-Office. Film is running successfully in all centers with House full collections. Film has been getting good family entertainer talk from the day of its release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X