'మిస్టర్ పర్ ఫెక్ట్ సంక్రాంతికి వచ్చేస్తున్నాడు..!
కొన్ని ప్లాప్ ల తర్వాత 'డార్లింగ్" హిట్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం హీరోగా దశరథ్ దర్శకత్వంలో 'దిల్" రాజు నిర్మిస్తున్న వర్కింగ్ టైటిల్'మిస్టర్ పర్ ఫెక్ట్" దాదాపు పూర్తి కావచ్చింది. ప్రొస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తిచేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తాప్సీ, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాని 'సంక్రాంతికి" విడుదల చేయాలనుకుంటున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ప్రభాస్ 'వర్షం" సినిమా ఘనవిజయం సాధించింది. దాంతో దిల్ రాజు సెంటిమెంట్ తో సంక్రాతికి విడుదల చేసి క్యాష్ చేసుకొనుటకు ప్లాన్ చేస్తున్నారు.
'మిస్టర్ పర్ ఫెక్ట్" కూడా ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ప్రభాస్ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంచనాలు మొదయ్యాయి. ప్రభాస్ సంక్రాంతి సెంటిమెంట్ ను 'మిస్టర్ పర్ ఫెక్ట్" నిజం చేస్తుందో లేదో చూడాలి. అంతలోపు యంగ్ రెబల్ స్టార్ రాఘవా లారెన్స్ దర్శకత్వంలో 'రెబల్" పార్ట్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యేలోపు రాజమౌళి 'ఈగ" పూర్తి చేసేసి ప్రభాస్ తో సినిమా తీయుటకు సిద్దం చేసుకోనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











