»   » 'మిస్టర్‌ యోగి' ఫస్ట్‌లుక్‌ విడుదల

'మిస్టర్‌ యోగి' ఫస్ట్‌లుక్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

జవాన్‌ అండ్‌ కాస్పియన్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై అజయ్‌ హీరోగా సుధాకర్‌ వినుకొండ దర్శకత్వంలో జె.వై. రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్‌ యోగి'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని హీరో నవీన్‌చంద్ర హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అజయ్‌, చిత్ర దర్శకుడు సుధాకర్‌ వినుకొండ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ సుధాకర్‌ రావు కులకర్ణి, కిరణ్‌ సిరిగిరి; రైటర్‌ టైమ్‌ నాని, శాలిని తదితరులు పాల్గొన్నారు.

Mr Yogi First look released

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుధాకర్‌ వినుకొండ మాట్లాడుతూ...' మా చిత్ర పోస్టర్‌ని విడుదల చేసిన హీరో నవీన్‌చంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇదొక వెరైటీ స్టోరీ. మా హీరో అజయ్‌ ఈ సబ్జెక్ట్‌కు, టైటిల్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యాడు. మ్యూజికల్‌గా కూడా అద్భుతంగా ఉంటుంది. నిర్మాత జె.వై రెడ్డిగారి ప్రోత్సాహంతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాము. ఈ నెల 24 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది.

Mr Yogi First look released

అజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిరణ్‌ శంకర్‌, కెమెరా: దులీప్‌ కుమార్‌; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సుధాకర్‌ రావు కులకర్ణి, కిరణ్‌ సిరిగిరి; ప్రొడ్యూసర్‌: జె.వై. రెడ్డి. కథ-దర్శకత్వం: సుధాకర్‌ వినుకొండ.

English summary
Mr Yogi First look poster launched by actor Naveen Chandra today. The movie starring Ajay and others. The movie directed by Sudhakar Vinukonda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu