Lust Stories 2 : సోషల్ మీడియాలో అంతా మృణాల్, తమన్నా హీటె.. ఈ సీన్స్ చూశారా?

'సీతారామం.. హీరోయిన్ సీతనేనా ఇలా హాట్ హాట్ సీన్స్ లో చూసేది?'.. 'మిల్కీ బ్యూటీ తమన్నానేనా? ఇలా పచ్చి పచ్చి డైలాగ్ లు మాట్లాడేది?' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల గురించే ఫుల్ ట్రెండింగ్. ఇప్పుడంతా వీరి గురించి అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా అంతా మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే ఈ ఇద్దరు భామలు వివరణ ఇచ్చుకునప్పట్టికీ ట్రెండింగ్ మాత్రం గ్యాప్ లేకుండా రోజుల తరబడి కొనసాగుతూనే వస్తోంది. అస్సలు ఆగట్లేదు. వివరాల్లోకి వెళితే...

అనౌన్స్ మెంట్ నుంచే విపరీతంగా... :'లస్ట్ స్టోరీస్'.. మొదటి సీజన్ను ఆడియెన్స్​ను ఎంతలా ఆదరించారో తెలిసిన విషయమే. ఫ్యామిలీ ఆడియెన్స్​కు రీచ్ తక్కువే అయినా.. మిగతా వర్గాల ప్రేకులను బాగానే ఆకట్టుకుంది. రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ, నేహా ధూపియా వంటి అందాల భామలు అందులో నటించి యూత్ ను ఆకట్టుకున్నారు. దీంతో ఇప్పుడు వచ్చిన సీజన్ 2పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ మొదలు.. పోస్టర్స్, ప్రచార చిత్రాలు అన్నీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూశారు.

Mrinal and Tamannaah Lust Stories 2 hot scenes are viral on social media

మృణాల్ ఠాకూర్-తమన్నాతో మరింతగా.. :ఇక ఈ సిరీస్ లో సీతారమం బ్యూటీ మృణాల్ ఠాకూర్, మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది అనగానే యూత్ లో సిరీస్ పై ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. దానికి తోడు ఇప్పటికే రిలీజైన పోస్టర్, ప్రచార చిత్రాల్లో ఈ బ్యూటీ లిద్దరూ షాక్ అయ్యేలా బోల్డ్ సీన్స్ లో నటించడం, బోల్డ్ డైలాగ్ లు మాట్లాడటం వంటివి చూపించడంతో.. సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ లస్ట్​ స్టోరీస్​ హ్యాష్ ట్యాగ్​ బాగా ట్రెండ్ అయింది. దీంతో ఈ సిరీస్ ను చూసేందుకు ఆసక్తి, అంచనాలు మరింత పెరిగిపోయాయి.

నాన్ స్టాప్ గా ట్రెండింగ్.. :అయితే ఎట్టకేలకు జూన్​ 29 నుంచి నెట్​ఫ్లిక్స్​లోకి అందుబాటులోకి వచ్చేసింది. దీంతో చాలా మంది సినీ ప్రేమికులు తొలి రోజే సిరీస్ ను చూసేసి తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించేశారు. చాలా మందికి ఈ సిరీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. బోల్డ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ తో సిరీస్ చూసినప్పటికీ.. ఆద్యంతం సిరీస్ మొత్తం ఎటువంటి మిగతా ఎమోషన్స్ లేకుండా కేవలం బోల్డ్ ను మాత్రమే చూపించడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపరిచారు. ఇంకా కొంతమందైతే.. మృణాల్ ఠాకూర్, తమన్నాను ట్రెండ్ అండ్ ట్రోల్ చేయడం ప్రారంభించేశారు.

సోషల్ మీడియా అంతా అదే హీట్.. :ఇక తమన్నా, మృణాల్ సన్నివేశాలను, డైలాగ్ లను ట్రెండ్-ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఇప్పటికే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల సన్నివేశాలు, ఫొటోలతో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోయింది. అయితే సిరీస్ అందుబాటులోకి వచ్చాక ఆ హీట్ మరింత పెరిగిపోయింది. నెట్టింట ఎక్కడ చూసిన తమన్నా - మృణాల్ ఠాకూరే కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు బ్యూటీల హాట్ క్లిప్స్ నేషనల్ వైడ్‌గా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

కొంతమందైతే వీరిపై దారుణంగా విమర్శిస్తున్నారు కూడా. అసలు ఈ ముద్దుగుమ్మలు గతంలో చేసిన సినిమాలు ఏంటి, ఇప్పుడు చేస్తున్న వెబ్ సిరీస్‌లు ఏంటి? అంటూ ట్రోల్స్ తో కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈమె మా సీతనే కాదు.. మా తమన్నానే కాదు అని చెబుతున్నారు. మరో విషయమేమిటంటే.. తమన్నా.. ఈ సిరీస్ మాత్రమే పది రోజుల క్రితమే 'జీ కర్దా'లోనూ ఇలానే బోల్డ్ సీన్స్ లో కనపించి హాట్ టాపిక్ గా మారింది. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి మరీ నటించింది. ఇక ఆ వేడి చల్లారకముందే.. మరో బోల్డ్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్‌ ముందుకి రావడంతో తమన్నాపై ట్రోలింగ్ మరింత ఎక్కువైపోయింది.

తమన్నా-మృణాల్ స్పందన.. :ముఖ్యంగా సిరీస్ లో తనకు సంబంధించిన బెడ్ రూమ్ సీన్ ఒకటి సోషల్ మీడియాను ఫుల్ హీట్ ఎక్కించేస్తోంది. దీనిపై మృణాల్ హాట్ కామెంట్స్ కూడా వైరల్‌గా మారాయి. సెక్స్ అండ్ లస్ట్ గురించి ఇంట్లోని యుక్త వయసు వారితో మాట్లాడటం చాలా అవసరం. వాళ్లకు దీనిపై సరైన సమాచారం అందించాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక తమన్నా కూడా తన నటన గురించి తనను తాను సమర్థించుకుంది. ఎవరేమీ అన్నా తాను పట్టించుకోనని చెప్పుకొచ్చింది. అలా ఈ ఇద్దురు హాట్ బ్యూటీ.. తమ కామెంట్స్‌తోను యూత్ కు చెమటలు పట్టించేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X