LGM మూవీ తమిళంలో ఎందుకు చేశామంటే?.. MS Dhoni భార్య సాక్షి క్లారిటీ
ఇండియన్ క్రికెట్ చరిత్రలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM (Lets get Married) సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. మూవీ ట్రైలర్‌ను ధోని, ఆయన సతీమణి సాక్షి ధోని పాల్గొన్నారు.
హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు.చెన్నైలో ఆడియో ఈవెంట్ వేడుక ఈ సందర్భంగా..

సాక్షి ధోని మాట్లాడుతూ .. LGM (Lets get Married) సినిమా గురించి చెప్పాలంటే.. పెళ్లి విషయంలో మన చుట్టూ చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇలాంటి పాయింట్ మీద సినిమా ఎందుకు చేయకూడదనిపించింది. అప్పుడు దర్శకుడు రమేష్‌తో మాట్లాడి సినిమా మొదలుపెట్టాం. ఈ సినిమాను తమిళంలోనే చేయటానికి కారణం ధోనీయే. చెన్నైతో మాకున్న అనుబంధం కారణంగా మా తొలి సినిమాను ఇక్కడే చేశాం అని అన్నారు.
చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ధోనికి, సాక్షికి ధన్యవాదాలు. ఈ సినిమాకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వర్క్ చేశాం. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌ను సాక్షిగారే చెప్పారు. మేం తర్వాత డిస్కషన్స్ చేసుకుని కథను రూపొందించాం. LGM (Lets get Married) అందరూ ఎంజాయ్ చేసేలా ఉండే సినిమా. మంచి టీమ్‌తో కలిసి పని చేశాను. ప్రతీ ఇంటిలో ఉండే పెళ్లి సమస్యతో LGM (Lets get Married) మూవీ తెరకెక్కింది. అందరికీ సినిమా కెనెక్ట్ అవుతుంది అని అన్నారు.
నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు, ఆర్జే విజయ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రమేష్ తమిళమణి
నిర్మాతలు: సాక్షి సింగ్ ధోని, వికాస్ హజ్జా
అసోసియేట్ ప్రొడ్యూసర్: షర్మిల జే రాజా, ఎంవీ ఎం వేల్ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రవణ్ సోలంకి, కన్నన్.పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రియాంశు చోప్రా
సినిమాటోగ్రఫి: విశ్వజీత్ ఒడుకతిల్
సంగీతం: రమేష్ తమిళ్ మణి
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
పాటలు: మదన్ కర్కి
బ్యానర్: ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్


Click it and Unblock the Notifications











