twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గడాఫీపై... ఎమ్మెస్ నారాయణ కామెడీ టచ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ 'దూకుడు' చిత్రంలో బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ తదితర హీరోలపై స్ఫూఫ్‌లు చేసిన ఆడియన్స్‌ని తెగ నవ్వించిన విషయం తెలిసిందే. తాజాగా గడాఫీ లియన్ నియంత గడాఫీ‌పై నవ్వించబోతున్నాడు. 'రొటీన్ లవ్ స్టోరీ' చిత్రంలో ఎమ్మెస్ గడాఫీ గెటప్‌లో కనిపించి నవ్వులు పంచనున్నాడు.

    'స్నేహగీతం' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా 'రోటీన్ లవ్ స్టోరీ'. 'ఎస్.ఎం.ఎస్.' ఫేం రెజీనా హీరోయిన్. వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్, బెంచ్ మార్క్ మూవీస్ బేనర్లపై చాణక్య బోనేటి, పి. మణికుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఎల్బీడబ్ల్యూ' ద్వారా దర్శకునిగా పరిచయమైన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.

    ఇది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. రొటీన్ లవ్ స్టోరీని వెరైటీగా చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ" అని ప్రవీణ్ తెలిపాడు. హీరో సందీప్ ఇందులో 19 సంవత్సరాల కుర్రాడిగా నటిస్తుండటం విశేషం. హీరో ఓ లాజిక్ తో బతికేస్తుంటాడు. అదే లాజిక్ ని అప్లైచేసి ప్రేమలో ఎలా గెలుపొందాడనేది ఆసక్తికర అంశం.

    కృష్ణుడు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, హేమ, సురేఖావాణి, ఝాన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేశ్, ప్రగతి, హేమంత్, భరత్, స్నిగ్ధ, స్వప్నిక తారాగణం. ఈ సినిమాకి పాటలు: కృష్ణచిన్ని మాదినేని, సినిమాటోగ్రఫీ: సురేశ్/చోటా కె. నాయుడు, కూర్పు: ధర్మేంద్ర, ఆర్ట్: ఉపేంద్ర, కాస్ట్యూం డిజైనర్: శాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.

    English summary
    Ace Comedian MS Narayana is sporting a new look in his upcoming film 'Routine Love Story'. The actor will be seen in a funny role which is the lookalike of Libyan slain leader Muammar Gaddafi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X