పవన్ కళ్యాణ్‌పై.... ఎంఎస్ నారాయణ ఫన్నీ సెటైర్

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ కమెడియన్, నందీ అవార్డు విన్నర్ ఎంఎస్ నారాయణ ఫన్నీ కామెంట్ చేసారు. తనకు అవార్డు దక్కిన సందర్బంగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ ఆయనతో చిట్ చాట్ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పరిశ్రమలోని వివిధ స్టార్లతో ఎంఎస్‌కు ఉన్న సాన్ని హిత్యం, తదితర అంశాలను సదరు టీవీ ఛానల్ అడిగి తెలుసుకుంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన్ను ప్రశ్నించగా.... ఎంఎస్ నారాయణ విభిన్నంగా స్పందించారు. 'పవన్ కళ్యాణ్ గారిది మంచి వ్యక్తిత్వం. ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకప్పుడు ఆయన్ను నేరుగా వెళ్లి కలిసే వాన్ని, అయితే ఇప్పుడు ఆయన్ను చూడాలంటే టిక్కెట్టు కొనుక్కుకుని థియేటర్‌కు వెళ్లాల్సిందే' అని వ్యాఖ్యానించారు.

అయితే ఇది ఎంఎస్ కేవలం కామెడీగా అన్న వ్యాఖ్యలే. పవన్ కెరీర్ ప్రారంభంలో ఆయన్ను కలవడానికి వీలుండేది. ఇప్పుడు ఆయన సినిమాలతో బిజీ అయిపోయారు కాబట్టి కలవడం వీలు కావడం లేదు. ఆయన సినిమా కార్యక్రమాలకు, ఇతర ప్రైవేటు ఫంక్షన్లకు రావడం కూడా తక్కువే. అందువల్ల ఆయన్ను కలవడం వీలు కావడం లేదు అని వివరణ ఇచ్చారు ఎంఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X