అది నాన్నను కబలిస్తుందనుకోలేదు: ఎంఎస్ కూతురు
హైదరాబాద్: ఎంఎస్ నారాయణ మరణానికి దారి తీసిన కారణాలు వివరిస్తూ ఆయన కూతురు, దర్శకురాలు శశి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ నెల 19వ తేదీన భీమవరంలో ఉండగా నాన్న అనారోగ్యానికి గురయ్యారు. మలేరియా అటాక్ చేయడంతో ఆయన్ను విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు.
మరింత మెరుగైన వైద్యం కోసం మూడు రోజుల క్రితం కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. మలేరియానే కదా తగ్గి పోతుందని అనుకున్నాం. కానీ అది ఇలా నాన్నను కబలిస్తుందని అనుకోలేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మలేరియా అటాక్ చేయడం, అప్పటికే ఆయనకు మదుమేహం ఉండటంతో పరిస్థితి విషయమించింది.

దీనికి తోడు గుండు సంబంధ సమస్య, కిడ్నీ సమస్య కూడా రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించడంతో పాటు డయాలసిస్ చేసారు. అయినా పరిస్థితి మెరుగు పడలేదు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందంటూ వైద్యులు గురువారం నుండే హెల్త్ బెలిటెన్లు విడుదల చేసారు. శుక్రవారం ఉదయం 9.40 గంగలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఎంఎస్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
శుక్రవారం మధ్నాహ్నం 2 గంటల నుండి సాయంత్రం4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్లో ఎంఎస్ పార్థివదేహాన్ని ఉంచబోతున్నారు. వికారాబాద్ లోని ఎంఎస్ ఫామ్ మౌస్ లో రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











