‘దూకుడు’లో బ్రహ్మికి చెక్-ఎంఎస్ హైలెట్
మహేష్ దూకుడు పై రోజుకు రోజుకు అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. దూకుడు యూనిట్ కూడా ఒకొక్క హైలైట్ ను లీక్ చేస్తూ అంచనాలను మరింతగా పెంచుతున్నారు. ఇప్పటికే దూకుడు సాంగ్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అభిమానులకు టైటిల్ సాంగ్ మరింతగా విందు చేస్తుంది. ఇక దూకుడు గురుంచి తాజా లీక్ ఏంటంటే……, కమెడియన్ ఎమ్ఎస్ నారాయణ ఇరగదీసాడంట.
శ్రీను వైట్ల ప్రతి సినిమాలో కామెడి మిక్స్ చేసి హిట్ కొడుతుంటాడు. డీ, రెడీ, నమో వెంకటేశ ఇలా అన్ని సినిమాలలోనూ కామెడి, అందులోనూ బ్రహ్మి క్యారక్టర్ తో శ్రీను వైట్ల కామెడి పండించాడు. అయితే ఈ సారి కామెడి కోసం బ్రహ్మానందంని కాకుండా ఎమ్ఎస్ ను ఉపయోగించుకున్నాడట శ్రీను వైట్ల. రవితేజ దుబాయ్ శీనులో ఫైర్ స్టార్ గా ఎమ్ఎస్ కామెడీ సూపర్ హిట్ అయ్యింది. అదే ఫార్ములాను దూకుడులో కూడా ఉపయోగిస్తున్నాడు శ్రీను వైట్ల. ఎమ్ఎస్ నారాయణ పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. కచ్చితంగా ఎమ్ఎస్ క్యారక్టర్ సినిమాను సూపర్ హిట్ గా నిలపడంలో మెయిన్ రోల్ పోషిస్తుందని యూనిట్ భావిస్తుంది.


Click it and Unblock the Notifications











