ఎమ్.ఎస్.రాజు, కోడిరామకృష్ణ కాంబినేషన్ లో గతంలో ఎన్నో చిత్రాలు, హిట్స్, సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో వీరు కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే అతి త్వరలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు సినిమా చేయనున్నారని సమాచారం. అరుంధతి మెగా హిట్ చూసిన ఎమ్.ఎస్.రాజు ఈ ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధానాంశంగానే ఈ చిత్రం కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఎమ్.ఎస్.రాజు ఈ మధ్యకాలంలో వరస ఫ్లాఫ్ ల్లో పడిపోయారు. నూతన తరం చిత్రాలు తీస్తున్నామంటూ ఆయన పూర్తిగా వెనకపడిపోయారు. ఇప్పుడు పాత కాంబినేషన్ తో హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయి.