Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్': డర్టీ హరి తరువాత మరో డిఫరెంట్ మూవీ
'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలను నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గురించి అందరికి తెలిసిందే. నిర్మాత ఎంఎస్ రాజు మాస్టర్ మైండ్ వల్లే అలాంటి మంచి సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. ఈ సీనియర్ ప్రొడ్యూసర్ గత ఏడాది డైరెక్ట్ చేసిన 'డర్టీ హరి' భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ఇక డైరెక్టర్ సక్సెస్ అవ్వడంతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు సందర్భంగా తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై '7 డేస్ 6 నైట్స్' పేరుతో ఓ సినిమాను నిర్మించనున్నారు. వింటేజ్ పిక్చర్స్ - ఏబిజి క్రియేషన్స్ కూడా సినిమా నిర్మాణంలో భాగం కానున్నాయి.
సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ "ఎన్నో బాక్సాఫీస్ చిత్రాలను నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లోనే ఈ '7 డేస్ 6 నైట్స్' సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందిని అంటూ.. మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఇక జూన్ 7న ప్రాజెక్టును స్టార్ట్ చేసి హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ వంటి ప్రధాన నగరాల్లో షూటింగ్ చేసేలా షెడ్యూల్స్ సెట్ చేసుకున్నట్లు సుమంత్ చెప్పారు. ఇక ఈ సినిమా యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా ఉంటుందని ఎమ్ఎస్.రాజు వివరణ ఇచ్చారు.
ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, పబ్లిసిటీ: ఈశ్వర్ అందే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్: అశ్విన్ కశ్యప్, యువి సుష్మ, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.