'ఒక్కడు' సెట్లో భూమిక బండ బూతులు తిట్టింది.. పాత సంగతి రివీల్ చేసిన ఎంఎస్ రాజు!

ఢిల్లీలో పుట్టిన రచన చావ్లా సినిమాల మీద ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించింది. ఆర్మీ కుటుంబానికి చెందిన ఆమె ఎలా అయినా సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ముంబై షిఫ్ట్ అయి అక్కడే యాడ్ ఫిలింస్ చేస్తూ కొన్ని హిందీ మ్యూజిక్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది. తర్వాత తెలుగులో యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన పేరు భూమిక చావ్లాగా మార్చుకుంది. అయితే తాజాగా ఒక్కడు సినిమా షూటింగ్ లో భూమిక చావ్లా బండ బూతులు తిట్టింది అంటూ ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు ఒక పాత విషయాన్ని బయట పెట్టారు. వివరాల్లోకి వెళితే

హీరోయిన్ గా

హీరోయిన్ గా

తొలుత తెలుగులో యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భూమిక తరువాత తమిళ్ లో బద్రి అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు గానీ ఆమె పవన్ కళ్యాణ్ సరసన చేసిన మూడో సినిమా ఖుషి సూపర్ హిట్ కావడమే గాక ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.

వివాహం తర్వాత కూడా

వివాహం తర్వాత కూడా

ఇక ఆ తర్వాత ఆమె చేసిన స్నేహమంటే ఇదేరా, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, జై చిరంజీవ, మాయాబజార్, సత్య, అనసూయ, స్వాగతం, అమరావతి, కలెక్టర్ గారి భార్య వంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోయిన్ గా ఇక అవకాశాలు రావు అనుకున్న సమయంలో ఆమె హ్యాపీగా భరత్ ఠాకూర్ అనే ఒక యోగా శిక్షకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లో అక్క, వదిన వంటి పాత్రలలో కనిపిస్తూనే ఉంది.

సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ ప్రమోషన్స్

సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ ప్రమోషన్స్

తాజాగా దర్శకుడిగా మారి పలు సినిమాలు చేస్తున్న నిర్మాత ఎంఎస్ రాజు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఆయన చేసిన సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ చేసుకునే పనిలో పడ్డారు.

ఫైటర్ మీద ఫైర్

ఫైటర్ మీద ఫైర్

అందులో భాగంగా ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ తో కలిసి ఆలీతో సరదాగా షోకి హాజరయ్యారు. ఈ షోలో భాగంగా ఆలీ ప్రశ్నిస్తూ భూమిక ఒక్కడు సెట్ లో బాగా ఫైర్ అయింది అంట కదా అని ప్రశ్నిస్తే అవును ఆ రోజు సెట్ లో నేను, మహేష్ బాబు, పక్కన భూమిక ముగ్గురు కూర్చుని ఉన్నాము, అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఒక ఫైటర్ మీద భూమిక ఫైర్ అయ్యింది.

అర్థం కాని బూతులు

అర్థం కాని బూతులు

ఇంగ్లీషులో అర్థం అయ్యి అర్థం కాని బూతులు తిట్టేసింది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాకయ్యారు అంటూ ఎంస్ రాజు చెప్పుకొచ్చారు. అయితే భూమిక ఎందుకు సదరు ఫైటర్ మీద ఫైర్ అయ్యింది? భూమిక అలా మాట్లాడుతుంటే చాలా సున్నిత మనస్కుడైన మహేష్ ఎలా స్పందించాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల మీద పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X