దిల్ రాజు సమర్పణలో ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో...
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు,ఎమ్ ఎస్ రాజు కలిసి ఒక్కటే ఒక సినిమాకు వర్క్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఎమ్ ఎస్ రాజు దర్సకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం టైటిల్ 'తూనీగ... తూనీగ'. ఎమ్ ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమవుతున్నారు. మాగంటి రామ్‌చంద్రన్ (రామ్‌జీ) నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఇదో చక్కని ప్రేమకథ. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల చేస్తాము అన్నారు. ఇక ఎమ్.ఎస్ రాజు గతంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'మనసంతా నువ్వే'లోని 'తూనీగ... తూనీగ, ఎందాక పరిగెడతావె' పాటలోని పదాలుతో ఈ టైటిల్ ని సెంటిమెంట్ గా పెట్టారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఫెరఫెక్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్ ఎస్ రాజు తన కుమారుడు చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారని వినికిడి. అలాగే తమ బ్యానర్ లో వర్షం,మనసంతా నువ్వే,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంచనాలు ఉన్నారు. ఇక ఎమ్ ఎస్ రాజు వాన చిత్రంతో డైరక్టర్ గా మారారు. ఆయన రెండో చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











