ఎమ్ఎస్ రాజు సినిమాకి అదే టైటిల్ ఫిక్స్
ఎమ్.ఎస్ రాజు తన కుమారుడు తో చేస్తున్న చిత్రానికి 'తూనీగ... తూనీగ...' నే ఫైనల్ చేసారు.ఈ చిత్రానికి టైటిల్ గా మొదట మిర్చి అని ఫిక్స్ చేసారు. కానీ ఇప్పుడా టైటల్ ని మార్చి తనకు కలిసి వచ్చిన మనసంతా నువ్వే లోని తూనీగ తూనీగ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన నిర్మించిన 'మనసంతా నువ్వే' లో సూపర్ హిట్ 'తూనీగ... తూనీగ...' పాటను గుర్తు చేస్తూ ఈ టైటిల్ పెట్టారు. ఆ పాటతో లక్ కలిసి వచ్చిందని,అలాగే ఈ సినిమా కూడా అదే హిట్ అవుతుందని బావిస్తున్నారు.
ఇక ఎమ్.ఎస్. రాజు స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. మాగంటి రామ్ జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











