ఎమ్.ఎస్.రాజు కుమారుడు సినిమా లేటెస్ట్ ఇన్ఫో?
మెగా ప్రొడ్యూసర్ గా వరసగా హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ ని పరిచయం చేస్తూ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు ఫిప్టీ పర్శంట్ వరకూ కంప్లీట్ అయింది. ఆగస్టు నెలలో అన్ని పనులూ పూర్తి చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ గా మొదట మర్చి అని ఫిక్స్ చేసారు. కానీ ఇప్పుడా టైటల్ ని మార్చి తనకు కలిసి వచ్చిన మనసంతా నువ్వే లోని తూనీగ తూనీగ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అభివర్ణిస్తున్నారు. మంతెన రామ్ జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు స్వయంగా దర్సకత్వం వహిస్తున్నారు. వాన చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక వాన సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎలాగయినా ఒక్క సక్సెస్ ఇచ్చి డైరక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆయన కసిగా ఉన్నారు. అందుకోసం కొడుకు కెరీర్ నే పణంగా పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











