'జపం' టైటిల్ తో ఎమ్.ఎస్ రాజు కొత్త చిత్రం
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు ..నిర్మాత నుంచి దర్శకుడుగా షిఫ్ట్ అయిన వద్ద నుంచి ఆయనకు సక్సెస్ లు కరువయ్యాయి. వాన చిత్రం డిజాస్టర్ ఫలితం ఇచ్చినా తర్వాత తూనీగ తూనీగ అంటూ ఆయన కుమారుడుని లాంచ్ చేసారు. ఆ చిత్రం టీవీ సీరియల్ తరహాలో ఉందంటూ విమర్శలు వచ్చి ఫ్లాప్ అయ్యింది. తర్వాత ముగ్గురు హీరోయిన్స్ తో రమ్ అనే చిత్రం మొదలెట్టారు. ఆ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కే ఆర్ధిక ఇబ్బందులలో ప్యాకప్ అంది. ఈ నేపధ్యంలో ఆయన ఇప్పుడు 'జపం' టైటిల్ తో మరో చిత్రం చేయటానికి సిద్దమవుతున్నారు. ఈ సారి ఆయన దర్శకత్వం వహించబోయే చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్.
ఆయనే కథ,దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగులు ఇష్క్ ఫేమ్ రమేష్ సామల అందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతా కొత్త వాళ్లతో ఈ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ జపం అనే అర్దం లో ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఎమ్.ఎస్.రాజు స్వీయ దర్శకత్వంలో'రంభ ఊర్వశి మేనక' ('రమ్' )అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, నికీషా పటేల్, ఇషా చావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ఫైనాన్సియల్ క్రైసిస్ లో ఇరుక్కుని ఆగిపోయింది. ఈ చిత్రం మేజర్ షెడ్యూల్స్ రెండు జరిగి మూడో షెడ్యూల్ వద్ద ఆగిపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఆర్దిక ఇబ్బందులు రావటంతో ఎమ్.ఎస్ రాజు చేతులెత్తేసారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











