ఎమ్.ఎస్ రాజు 'తూనీగ తూనీగ'రిలీజ్ డేట్ ఖరారు
అందుకని మా ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఉంటాయి. మా సంస్థల్లో వచ్చిన గత చిత్రాల్లానే ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది. సుమంత్‌అశ్విన్ కొత్త హీరోలా కాకుండా బాగా ఈజ్‌తో యాక్ట్ చేశాడు. ఇది ప్రేమకథా చిత్రం. ఈ చిత్రం క్లయిమాక్స్ కొత్తగా ఉంటుంది. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది అని ఎమ్.ఎస్ రాజు చెప్పారు.
సమర్ఫకుడు దిల్ రాజు మాట్లాడుతూ...''అతను సీమటపాకాయ్ అయితే ఆ అమ్మాయి అగ్గి పుల్ల. ఒకటి ప్రతాపం చూపించాలంటే రెండోది తప్పకుండా వెలిగి తీరాలి. ఆ అమ్మాయిని చూడకపోతే అబ్బాయికి క్షణం కూడా గడవదు. అమ్మాయికీ అంతే! అంత మాత్రాన ఇద్దరూ మంచి మిత్రులనుకొంటే పొరపాటే. ఇద్దరి మధ్య తీయని శత్రుత్వం ఉంది. ఈ గొడవ ఇప్పుడు మొదలైంది కాదు. తూనీగ.. తూనీగ అంటూ ఆటలాడుకొన్నప్పుడే మొదలైంది. యుక్త వయసులో ఆ వైరం ప్రణయంగా మారిందో లేదో తెరపైనే చూడాలి అన్నారు'' అని అన్నారు.
నాకు ఈ సినిమా చూపించినప్పుడు ఫస్టాఫ్ సూపర్ అనిపించింది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. ఈ మధ్యలోనే కాస్త లోటు అనిపించింది. ఆ సంగతే చెబితే, మళ్లీ ఓ వారం షూటింగ్ చేసి చూపించారు. అల్టిమేట్ రిజల్ట్ వచ్చింది అన్నారు. అలాగే సుమంత్ అశ్విన్ అనుభవం ఉన్న హీరోలా చాలా ఈజ్‌తో చేశాడు. వెంకటేశ్, అల్లు అర్జున్ తర్వాత ఓ నిర్మాత కొడుకుగా సుమంత్ అశ్విన్ హీరోగా సెటిల్ అవుతాడు. నేను చెప్పింది నిజమని సినిమా విడుదలైన రోజు ప్రేక్షకులు ఏకీభవిస్తారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్టయ్యాయి. కొడుకును పరిచయం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెస్ రాజు రెట్టింపు కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యాక మా బేనర్‌లోనే అశ్విన్‌తో రెండో సినిమా చేస్తాం'' అని చెప్పారు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.


Click it and Unblock the Notifications












