ఇప్పుడీ టైటిల్ తో సుమంత్ ఆర్ట్స్ వారు సినిమా ప్లాన్ చేస్తున్నారు. హీరో కూడా మరెవరో కాదు...యమ్.యస్ రాజు గారబ్బాయి సుమంత్ అశ్విన్ . యూత్ ఫుల్ ఎంటర్నైనర్ గా రూపొందే ఈ సినిమాకి దర్శకుడుగా ఓ సీనియర్ కొ డైరక్టర్ ని పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్టుని టీనేజ్ లవ్ స్టోరీలు తీసి ప్రపంచం మీదకి వదిలే తేజ చేతిలో పెడదామనుకున్నారు. కానీ అనుకోనివి జరిగి అది ముందుకు వెళ్ళలేదు. దాంతో ఈ లోపు మన మెగా నిర్మాత గారు తన కుమారుడుకి హీరోకి కావల్సినవి అన్ని నేర్పించి రెడీ చేసారు. అంటే త్వరలోనే చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్...వెండి తెరపైకి వస్తుందన్నమాట.