ప్రభాస్‌తో ఎంఎస్ రాజు మరో సినిమా
ప్రభాస్ హీరోగా ఎంఎస్ రాజు మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సినిమాకు వీరశంకర్ దర్శకత్వం వహించే అవకాశమున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. వేగంగా షూటింగ్ జరిగితే ఈ సినిమా 2007 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది. గతంలో ప్రభాస్ హీరోగా ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రం సూపర్‌హిట్ అయింది. సంక్రాంతి సినిమాల పోరులో విజయం సాధిస్తూ వస్తున్న ఎంఎస్ రాజు ఈసారి కూడా విజయం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా తన సినిమాల కథలను ఎంఎస్ రాజు స్వయంగా తయారు చేయించుకుంటూ ఉంటారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కథా చర్చల్లో కూర్చోబెట్టి ఆయన సూచనలకు అనుగుణంగా కథలో మార్పు చేస్తుంటారు.


Click it and Unblock the Notifications