హాస్య నటుడు, దర్శకుడు ఎమ్మెస్ నారాయణ అల్లుడు దుర్గాప్రసాద్‌ను హైదరాబాద్‌లోని సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవరెడ్డినగర్ ఎస్సై ఎస్. వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం అతని మీద అతని భార్య శశికిరణ్ (ఎమ్మెస్ నారాయణ కుమార్తె) వరకట్న కేసు దాఖలు చేసింది. 1996లో ఎమ్మెస్ నారాయణ కుమార్తెను దుర్గాప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. నారాయణకు అతను మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తూ వచ్చాడు. పెళ్లి సమయంలో అతనికి కట్నం కింద 5 లక్షల రూపాయల నగదు, 50 తులాల బంగారు ఆభరణాలను నారాయణ ఇచ్చారు. అయితే దుర్గాప్రసాద్ మరింత డబ్బు కోసం భార్యని వేధిస్తూ వచ్చాడనేది అతని మీదున్న ఫిర్యాదు. అంతేగాక ఒక జూనియర్ ఆర్టిస్టుతోనూ అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ ఫిర్యాదులో తెలిపారు
Story first published: Monday, April 20, 2026, 3:43 [IST]