ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి సినిమాకి లీగల్ సమస్యలు
ఈ విషయంపై నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా తీసేందుకు వీలుగా సుబ్బులక్ష్మిపై టీజేయస్ జార్జ్ రాసిన పుస్తకం హక్కుల్ని కొనుగోలు చేశాం. అలాగే సుబులక్ష్మి కుమార్తె నుంచీ అనుమతి పొందాం. ఈ క్రమంలో ఇదే కథాంశంతో రాజీవ్ మీనన్ సినిమాని ప్రకటించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై మేం న్యాయపరంగా పోరాటం చేస్తాము''అన్నారు.
దివంగత ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నటి విద్యాబాలన్ నటించనున్నారన్నది తాజావార్త. సంగీ త రంగంలో మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయురాలిగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రసిద్ధికెక్కారు. ఆమె కర్ణాటక సంగీతంలో ఒక ప్రత్యేక స్థానా న్ని ఏర్పరచుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసురాలి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో బాలీవుడ్‌లో సంచలన నటిగా పేరొందిన బెంగళూరు భామ విద్యాబాలన్ నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే శృంగారతార సిల్క్‌స్మిత పాత్రలో నటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












