twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి సినిమాకి లీగల్ సమస్యలు

    By Srikanya
    |

    ముంబై : ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు దివంగత ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తారు. అయితే ఈ చిత్రానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. మలయాళ నిర్మాత సోమప్రసాద్‌ తొంభై రోజులపాటు ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవితానికి సంబంధించి ఎలాంటి సినిమా చిత్రీకరణ జరపకూడదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    ఈ విషయంపై నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా తీసేందుకు వీలుగా సుబ్బులక్ష్మిపై టీజేయస్‌ జార్జ్‌ రాసిన పుస్తకం హక్కుల్ని కొనుగోలు చేశాం. అలాగే సుబులక్ష్మి కుమార్తె నుంచీ అనుమతి పొందాం. ఈ క్రమంలో ఇదే కథాంశంతో రాజీవ్‌ మీనన్‌ సినిమాని ప్రకటించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై మేం న్యాయపరంగా పోరాటం చేస్తాము''అన్నారు.

    దివంగత ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నటి విద్యాబాలన్ నటించనున్నారన్నది తాజావార్త. సంగీ త రంగంలో మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయురాలిగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రసిద్ధికెక్కారు. ఆమె కర్ణాటక సంగీతంలో ఒక ప్రత్యేక స్థానా న్ని ఏర్పరచుకున్నారు.

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసురాలి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో బాలీవుడ్‌లో సంచలన నటిగా పేరొందిన బెంగళూరు భామ విద్యాబాలన్ నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే శృంగారతార సిల్క్‌స్మిత పాత్రలో నటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

    English summary
    The biopic on Bharat Ratna MS Subbulakshmi in the direction of Rajiv Menon is facing another obstacle. Already protest by a certain people against casting Vidya Balan in the role of a legendary singer. Now producer MP Somprasad got an injunction order on Rajiv Menon not to film this biopic. The producer is alleging that he bought the rights of the book on MS Subbu lakshmi written by George TJS and Rajiv Menon has signed to direct it for him but Rajiv Menon has announced this project on his own as Producer and director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X