»   » అక్టోబర్‌ 1న 'యంయస్‌జి-2' (ది మెసెంజర్‌ ) తెలుగు వెర్షన్‌

అక్టోబర్‌ 1న 'యంయస్‌జి-2' (ది మెసెంజర్‌ ) తెలుగు వెర్షన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హకీకత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్‌పై సంత్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆధ్యాత్మిక గురువు సామజిక స్పూర్తితో, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తప్పు దోవ పడుతున్న నేటి యవతరం కోసం 'యంయస్‌జి' ది మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ అనే భారీ బడ్జెట్‌ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి ఈ ఏడాది ఫిబ్రవరి 13న హిందీలో విడుదల చేసారు. అయితే ఈ చిత్రం అక్కడి ప్రజల మన్ననలు పొంది కలెక్షన్స్‌ పరంగా సంచలనం సృష్టించింది. సమాజంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా మొదటి చిత్రానికి కొనసాగింపుగా ఇటీవల 'యంయస్‌జి-2' ది మెసెంజర్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌ 18న సుమారు 2000 స్క్రీన్స్‌లో విడుదల చేసారు. మొదటి వారంలోనే ఈ చిత్రం 102.88 కోట్లు కలేక్ట్‌ చేసి మరోసారి రికార్డు బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం హిందీలో బ్లాక్‌బస్టర్‌ అయిన సందర్భంగా ముంబైలోని జె డబ్ల్యు మారియట్‌ హోటల్‌లో సక్సెస్‌ పార్టీని నిర్వహించారు. సెప్టెంబర్‌ 27న ప్రత్యేకంగా హైదరాబాద్‌ తెలుగు పాత్రికేయులను ఆహ్వానించి, ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నామని తెలియజేశారు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌.

'MSG 2 The Massenger' telugu release date

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు, గాయకుడు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ మాట్లాడుతూ - ''2015 ఫిబ్రవరి 13న నా మొదటి చిత్రం 'యంయస్‌జి' ది మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తప్పు దోవ పడుతున్న నేటి యవతరం కోసం ఒక మెసేజ్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్స్‌ చేసి ఆ చిత్రాన్ని అందించాను. నా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఒక పెద్ద సభ పెట్టి మంచి మెసేజ్‌ని ప్రబోధిస్తే అక్కడున్న కొన్ని వేలమంది మాత్రమే వింటారు, మారడానికి ప్రయత్నిస్తారు. అదే సినీ మీడియా ద్వారా వినోదాత్మకంగా చూపిస్తే కోట్ల మంది సినిమా చూసి మారతారని నా అభిప్రాయం. సినీ రంగంలో నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా, గతంలో కొన్ని డాక్యుమెంటరీలు తీసిన అనుభవంతో బాలీవుడ్‌లో వున్న కొంతమంది సాంకేతిక నిపుణుల సహకారంతో 'యంయస్‌జి' ప్రారంభించాను. మొదటి సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో 'నా మెసేజ్‌ని ప్రజలు అంగీకరించారన్న అభిప్రాయంతో ఈసారి మరో మంచి సందేశంతో 'యంయస్‌జి2' ది మెసెంజర్‌ చిత్రాన్ని నిర్మించాను. ఈ చిత్రంలో గిరిజనుల అభ్యున్నతి కోసం, మాంసాహారం భుజించడం ద్వారా మనిషికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలిపే అంశాలను చూపించాము. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 18న విడుదల చేశాము. రెండో భాగంగా రిలీజ్‌ అయిన 'ఎం.ఎస్‌.జి.2' మొదటి భాగాన్ని అధిగమించింది. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మొదటి వారమే 102.88 కోట్లరూపాయలు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. రెండోసారి కూడా నేను చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఒక మంచి సినిమా అనేది ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితం కాదు. సినిమా ద్వారా ఒక మంచి విషయాన్ని చెప్తున్నామంటే దాన్ని భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తారు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో రూపొందిన ఎన్నో మంచి చిత్రాలను తెలుగులోకి అనువదిస్తే తెలుగు ప్రేక్షులు ఆదరించారు. అందుకే ఈసారి హిందీలో సూపర్‌హిట్‌ మూవీగా పేరు తెచ్చుకున్న 'ఎం.ఎస్‌.జి.2' ది మెసెంజర్‌ చిత్రాన్ని అక్టోబర్‌ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమాజంలో మార్పు రావాలని ఒక మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

'MSG 2 The Massenger' telugu release date

ఈ చిత్రంలో ఇంకా అర్పిత్‌ రాంక (రేయ్‌ విలన్‌) రోహిత్‌ కురాన, హనీ ప్రీత్‌, చరణ్‌ ప్రీత్‌, షాన్‌ ఏ మీట్మ రోహ్‌ ఏ మీట్‌, కయ్నాథ్‌ తుర్‌, సుఖ్విందర్‌ సింగ్‌, సాహిల్‌, కపిల్‌, సత్యం నటిస్తున్నారు. ఎడిటింగ్‌: సంజయ్‌వర్మ, ఫైట్‌మాస్టర్‌: ఆనంద్‌శెట్టి, అజీజ్‌ షంషేర్‌, డాన్సు: రామ్‌రహీమ్‌ సింగ్‌, లల్లి పాప్‌, అరవింద్‌, డి.ఓ.పి: అరవింద్‌కుమార్‌, నిర్మాత: సి.పి.అరోరా ఇన్సాన్‌, సంగీతం, పాటలు, మాటలు, స్క్రీన్‌ ప్లే: సంత్‌ గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్‌, దర్శకత్వం: సంత్‌ గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌, జీతూ అరోరా ఇన్సాన్‌.

English summary
'MSG 2 The Massenger' telugu release date Oct 01.
Please Wait while comments are loading...