రాజుగారి ఆట కథ

By Staff

ఇటీవలి కాలంలో వరుస హిట్లు, సూపర్‌ హిట్లు అందిస్తున్న సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పౌర్ణమి ఫ్లాప్‌ అయ్యాక దూకుడు తగ్గించింది. అంతకుముందు వెంకటేష్‌, సిద్ధార్థలతో ఆట, మహేశ్‌బాబుతో సైనికుడు, ఎన్టీఆర్‌తో విజయదశమి, ఇంకా అల్లు అర్జున్‌, ప్రభాస్‌ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించినా ప్రస్తుతం ఆ సంస్థ ఆచితూచి సినిమాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఆట చిత్రానికి వస్తే ఇప్పటికి ఎంతోమంది రచయితలు ఈ సినిమా కోసం మారారు. మొదట ఆస్థాన రచయిత వీరూ పోట్ల ఈ చిత్రానికి కథ రాస్తున్నారని వినిపించింది. ఆ తరువాత దర్శకుడు శోభన్‌ కూడా ఈ స్క్రిప్టు మీద కుస్తీ పట్టారు. కానీ ఆ తరువాత వీరూ పోట్ల దర్శకత్వం అంటూ వేరే బ్యానర్‌కి వెళ్లిపోయారు. శోభన్‌ ఆ స్క్రిప్టు పనులు పూర్తి చేసినా.. ఇప్పుడు ఆటకు దర్శకుడు ఆయన కాదు. రవితేజతో రామ్‌గోపాల్‌ వర్మ తీసిన షాక్‌ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించిన హారిష్‌ శంకర్‌ ఇప్పుడు ఆటకు దర్శకుడు అని వినవస్తోంది. హారిష్‌ శంకర్‌ రంగంలోకి దిగాక ... పాత స్క్రిప్టును కాదని తనే సొంతగా ఒక కథ రాసుకున్నారని తెలుస్తోంది. చివరికి వెంకటేష్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ ఒక్కడు మిగిలాడు. ప్రస్తుతానికి అతనే హీరోగా నటిస్తాడని చెబుతున్నారు. ఇలా ఇంకా సినిమాగా తయారుకాకుండానే ఎన్నో మలుపులు తిరుగుతున్న ఆట సినిమా ఎప్పటికి మొదలయ్యేనో, తీరా విడుదలయ్యాక మరెన్ని సంచలనాలు చవిచూసేనో .. చూడాల్సిందే!

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X