నిహారిక కొణిదెల ‘ముద్దపప్పు ఆవకాయ’ (ఎపిసోడ్-1)
హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ' తొలి ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వం వహించిన ఈ తొలి ఎపిసోడ్ ఆకట్టుకునే విధంగా ఉంది.
ఇందులో నిహారిక పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది. ఇప్పటి వరకు నిహారికను యాంకర్‌గా కేవలం టీవీ షోలలోమాత్రమే చూసాం. ‘ముద్దపప్పు ఆవకాయ'తో తొలిసారిగా ఆమె నటిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. తనలోనూ మెగా ఫ్యామిలీ రక్తం ప్రవహిస్తోందని తన నటన ద్వారా ప్రూవ్ చేసుకుంది నిహారిక.
ఇందులో నిహారికకు జోడీగా ప్రతాప్ నటిస్తున్నాడు. ప్రతాప్ నటన కూడా ఆకట్టుకునే విధంగా. వర్ష, అదితి, హర్ష, మోహన్, ధనలక్ష్మి, లీరిషా, హుస్సేన్ షా కిరణ్, సంజీవ్, సంజన, వింధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎవరికి వారు తమ పాత్రలకు అనుగుణంగా మంచి నటన చూపించారు.
ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విద్యాసాగర్ & అఖిలేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: నాని, ప్రొడక్షన్ హెడ్: నిఖిల్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ప్రశాంత్, సాయి, మ్యూజిక్: కార్తీక్, దర్శకత్వం: ప్రణీత్ బ్రామందపల్లి.


Click it and Unblock the Notifications











