నిహారిక కొణిదెల ‘ముద్దపప్పు ఆవకాయ’ (ఎపిసోడ్-2)

By Bojja Kumar

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ' తొలి ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి నెటిజన్ల నుండి మంచి స్పందన వచ్చింది. తొలి ఎపిసోడ్ ను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. తాజాగా ‘ముద్ద పప్పు ఆవకావయ్' సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేసారు. తొలి ఎపిసోడ్ కు కొనసాగింపుగా రెండో ఎపిసోడ్ ఉంటుంది. తొలి రోజు 20వేల మందికి పైగా దీన్ని వీక్షించడం గమనార్హం.

Muddapappu Avakai Web Series Episode - 2

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్ద పప్పు ఆవకాయ్' తెరకెక్కుతోంది. తొలి ఎపిసోడ్లో నిహారిక పెర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఇందులో నిహారికకు జోడీగా ప్రతాప్ నటిస్తున్నాడు. ప్రతాప్ నటన కూడా ఆకట్టుకునే విధంగా. వర్ష, అదితి, హర్ష, మోహన్, ధనలక్ష్మి, లీరిషా, హుస్సేన్ షా కిరణ్, సంజీవ్, సంజన, వింధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎవరికి వారు తమ పాత్రలకు అనుగుణంగా మంచి నటన చూపించారు.

ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విద్యాసాగర్ & అఖిలేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: నాని, ప్రొడక్షన్ హెడ్: నిఖిల్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ప్రశాంత్, సాయి, మ్యూజిక్: కార్తీక్, దర్శకత్వం: ప్రణీత్ బ్రామందపల్లి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X