ముగ్గేస్తే నవ్వులే (ముగ్గురు ప్రివ్యూ)
మనసంతా నువ్వే వంటి సూపర్ హిట్ ఇచ్చిన వియన్ ఆదిత్య కి ఈ మధ్య కాలంలో హిట్టు అనేది లేదు.వరస ప్లాపులతో దూసుకుపోతున్న ఆయన తాజాగా రామానాయుడు బ్యానర్ లో ముగ్గురు అనే కామిడి చిత్రం రూపొందించారు.నవ్వే లక్ష్యంగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. కథ ప్రకారం పవన్, మారుతి, అంజి (నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్) అనే ముగ్గురు వాయుపుత్రుల కథ ఇది. అంటే వీళ్లు పనీపాటా లేకుండా గాలికి తిరుగుతుంటారు. కానీ కోరికలు మాత్రం చాలా ఎక్కువ. అందరిలాగే జీవితంలో బాగా స్థిరపడాలి అనుకొంటారు. కానీ ఏ పనీ చేయరు. షాలినీ, యామిని, మోహిని (శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య)లను ప్రేమిస్తారు. బాలపుత్రిక (రీమాసేన్) రంగ ప్రవేశంతో ఈ ఆరుగురి జీవితాలు మలుపు తిరుగుతాయి. అదేంటి? వాయుపుత్రుల కల ఎలా నెరవేరింది? అనేదే కథ. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ప్రతి ఒక్కరికి ఆశయం ఉండాలి. దానితోపాటు కృషి కూడా చేయాలి. అదే లేకపోతే జీవితం ఎలా మారుతుందో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. బ్రహ్మానందం పాత్ర అందరినీ నవ్విస్తుంద''న్నారు.
సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి.
నటీనటులు: నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్, రీమాసేన్, శ్రద్దాదాస్, సంజన, సౌమ్య, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అలీ తదితరులు
సంగీతం: కోటి,
నిర్మాత: డా||డి.రామానాయుడు
దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య


Click it and Unblock the Notifications











