ఆది ‘రఫ్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది

By Bojja Kumar

హైదరాబాద్: ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘రఫ్' చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. శ్రీదేవి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై అభిలాష్ మాధవరం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో వేడుక నవంబర్ 2న ఘనంగా జరుగనుంది.

కోపం వస్తే రఫ్‌ ఆడించే ఓ కుర్రాడు ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే టైప్‌ అతను. తన ప్రేమకి అడ్డొచ్చిన వారిని ఎలా 'రఫ్‌' ఆడించి తన ప్రేయసిని సొంతం చేసుకున్నాడనేది...ఆది, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రఫ్' సినిమా స్టోరీ లైన్.

Muhurtham fixed for Rough Audio Release

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా గురించి ఆది వివరిస్తూ....ప్రేమ కోసం ఏదైనా చేసే యువకుడిగా నటిస్తున్నాను. యాక్షన్‌, లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌ అన్ని కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. మణిశర్మగారు చక్కని సంగీతం అందించారు. నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్‌గా పెద్ద హిట్టవుతుంది.

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో శ్రీహరిగారికి ఎంత పేరొచ్చిందో అంతకు మించి పేరొచ్చే క్యారెక్టర్‌ శ్రీహరిగారు చేశారు. ఆయన ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను. దర్శకుడికిది తొలి చిత్రమైనప్పటికీ చాలా బాగా తెరకెక్కించారు. నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా నిర్మిస్తున్నారు అని అన్నారు.

నికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, అదుర్స్ రఘు, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - మరుధూరి రాజా, పాటలు - భాస్కర భట్ల, ఫైట్స్ - రామలక్ష్మణ్, డ్యాన్స్ - బాబా భాస్కర్, భాను, ఆర్ట్ - సీతారామాంజనేయులు, ఎడిటర్ - మార్తాండ్ .కె.వెంకటేష్, డి.ఓ.పి - కె. కె.సెంధిల్ కుమార్, అరుణ్ కుమార్, సంగీతం - మణిశర్మ, నిర్మాత - ఎమ్.అభిలాష్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సి.హెచ్.సుబ్బారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X