రామ్ చరణ్ కూతురికి ముఖేష్ అంబానీ గిఫ్ట్: అన్ని కేజీల బంగారంతో స్పెషల్‌గా.. అసలైన పండుగ ఎప్పుడంటే!
టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమైనా.. తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న అతడు.. గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. మంచి ఊపులో ఉన్న అతడిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఇటీవలే ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి ఫ్యామిలీ ఆనందం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ పాపకు ముఖేష్ అంబానీ గిఫ్ట్ పంపారు. ఆ వివరాలు మీరే చూడండి!
మెగా ప్రిన్సెస్.. ఫుల్ హ్యాపీ: జూన్ 20వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆరోజు తెల్లవారుజామున 1.49 గంటలకు మెగా ప్రిన్సెస్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. దీంతో చిరంజీవి ఫ్యామిలీతో పాటు వాళ్ల అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. అందరూ ఆ చిన్నారికి ఈ వరల్డ్‌లోకి సాదార స్వాగతాన్ని కూడా పలికారు.

నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్: రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు, సెలెబ్రిటీల నుంచి చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలా రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ హవానే కనిపించింది. అంతేకాదు, ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోయింది.

అంబానీ నుంచి కాస్ట్‌లీ గిఫ్ట్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు జన్మించిన కుమార్తెకు సెలెబ్రిటీల నుంచి ఆశీర్వాదాలతో పాటు అప్పుడే కొన్ని రకాల బహుమతులు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ కుభేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేన ముఖేష్ అంబానీ నుంచి మెగా ప్రిన్సెస్‌కు ఓ కాస్ట్‌లీ గిఫ్ట్ వచ్చినట్లు తాజాగా ఫిలిం నగర్‌లో న్యూస్ లీకైంది.

ఏకంగా బంగారు ఊయలే: మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్ గారాల కూతురుకు ముఖేష్ అంబానీ ఓ బంగారు ఊయలను బహుమతిగా పంపించారని ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ విషయాన్ని చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఓ ఫిల్మ్ జర్నలిస్టు సైతం తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడీ వార్త దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది.
అన్ని కేజీల బంగారంతో: రామ్ చరణ్ కుమార్తెకు ముఖేష్ అంబానీ నుంచి బంగారు ఊయల బహుమతిగా వచ్చిందని తెలిసిన నేపథ్యంలో దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా వాళ్లు పంపించిన ఊయలను దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అలా దీనికోసం అంబానీ రూ. 1.20 కోట్ల వరకూ ఖర్చు చేశారని అంటున్నారు.
ఈరోజే అసలైన పండుగ: రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు జన్మించిన కుమార్తెకు ఈరోజే (జూన్ 30వ తేదీ) బారసాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారని అంటున్నారు. ఈ సందర్భంగానే ముఖేష్ అంబానీ.. మెగా ప్రిన్సెస్‌కు ఆ బంగారపు ఊయలను బహుమతిగా పంపించారని టాక్ వినిపిస్తోంది.

పేరు పెట్టేది కూడా ఈరోజే: తమ సంప్రదాయం ప్రకారం బారసాల కార్యక్రమం రోజే పిల్లలకు పేర్లు పెడుతుంటారని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే స్పష్టం చేశాడు. దీనిబట్టి మెగా ప్రిన్సెస్‌కు ఈరోజే నామకరణం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏ పేరు పెడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











