చిరంజీవి కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్
హైదరాబాద్: నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వేడుక ఈ నెల 4న ప్లాన్ చేసారు. చిరంజీవి రాకపై ఆధారపడి ఈ ఆడియో వేడక జరుగనుంది. ఒక వేళ చిరంజీవి ఆ సమయానికి అందుబాటులో లేకుంటే ఆడియో వేడుక వాయిదా పడే అవకాశం కూడా ఉందని సమాచారం.
‘ముకుంద' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వరుణ్ తేజ్ ఈచిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది. సాధారణంగా తొలి సినిమా అనగానే పెర్ఫార్మెన్స్ పరంగా కాస్త పూర్‌గా ఉంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం యాక్టింగ్, డాన్స్ తదితర అంశాల్లో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడట. పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నవాడిలా వీలైనంత వరకు ఎక్కువగా టేకులు తీసుకోకుండా పర్‌ఫెక్టుగా చేస్తున్నాడట.

ఇతర వివరాలు ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











