వరుణ్ తేజ్ ‘ముకుందా’ ఆడియో ప్రోమోస్...(వినండి)
హైదరాబాద్ : మరో మెగా నట వారసుడు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ‘ముకుందా' ఆడియోని డిసెంబర్ 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్
సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.
వరుణ్‌తేజ్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.
లింక్స్ క్లిక్ చేసి సాంగ్ టీజర్ వినండి


Click it and Unblock the Notifications











