‘ముకుంద’ సెన్సార్ రిపోర్టు వచ్చేసింది
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ముకుందా'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 24న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ సినిమా కావడం, నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కావడంతో విడుదల ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఉంది. ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఆడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై పాజిటివ్ ఓపీనియర్ ఏర్పడింది.
ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.


Click it and Unblock the Notifications











