twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ -వెంకీలను మరిపిస్తారా?: 'గోపాల ..గోపాల' కన్నడ రీమేక్ పోస్టర్స్, ట్రైలర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం గోపాల గోపాల. క్రితం సంవత్సరం రిలీజైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడా చిత్రం ముకుందా మురారి పేరుతో కన్నడంలోకి రీమేక్ అయ్యింది.

    కన్నడ సూపర్ స్టార్స్ సుదీప్, ఉపేంద్రలు ఈ చిత్రంలో చేస్తున్నారు. 'గోపాల గోపాల' చిత్రంలో పవన్ పోషించిన గాడ్ గోపాల్ పాత్రలో సుదీప్ కనిపిస్తున్నారు. అలాగే వెంకటేష్ నటించిన భక్త గోపాల పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను సంప్రదించి ఒప్పించారు.

    దేవుడిపై నమ్మకం లేని నాస్తికుని పాత్రకు ఉపేంద్ర కంటే బెస్ట్ ఛాయిస్ మరెవరూ లభించలేదట సుదీప్‌కి... ఉపేంద్ర ఓకే చెప్పగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మధ్యనే చిత్రం ట్రైలర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

    తెలుగు ట్రైలర్ లాగే ఉందే

    ఈ ట్రైలర్ చూస్తూంటే మీకు తెలుగు ట్రైలర్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. యాజటీజ్ తెలుగు ట్రైలర్ ని దగ్గర పెట్టినట్లు గా చేసారు.

    తెలుగులోనే ఫాలో అయ్యారు

    తెలుగులోనే ఫాలో అయ్యారు

    బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల చిత్రంగా రీమేక్ చేసారు దర్శకుడు డాలి. ఈ సినిమాలో పవన్ కృష్ణుడిగా కనిపించగా, వెంకటేష్ ఆయన భక్తుడి పాత్రలో కనిపించి అలరించారు. అయితే గోపాల గోపాల చిత్రంను రీమేక్ చేయాలని భావించిన సుదీప్ కన్నడ వర్షెన్‌కు ముకుందా మురారి అనే టైటిల్‌ ఫెరఫెక్ట్ యాప్ట్ అని భావించారు.

    అత్తారింటికి దారేదిని సైతం

    అత్తారింటికి దారేదిని సైతం

    గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని రీమేక్ చేసిన సుదీప్, తాజాగా గోపాల గోపాల చిత్రాన్ని కన్నడ రీమేక్ చేసారు. పవన్ సినిమాలే తనకు అచ్చివస్తున్నట్లున్నాయి. పవన్ చేసిన సినిమాలు హిట్టైతే ఆయన అక్కడ పండుగ చేసుకుంటున్నారు.

    ఇక్కడ సినిమాలపై మోజు

    ఇక్కడ సినిమాలపై మోజు

    తెలుగు సినిమాల రీమేక్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు సుదీప్. ప్రభాస్ హిట్ మూవీ మిర్చిని మాణిక్య పేరుతో, అలాగే పవన్ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రాల్ని... కన్నడలో రీమేక్ చేసి.. సూపర్ హిట్స్‌ను అందుకున్న సుదీప్.. మరోసారి పవన్ సినిమాపై దృష్టిపెట్టి హిట్ కొట్టబోతున్నాడు.

    ఆ బైక్ నే వాడారు

    ఆ బైక్ నే వాడారు

    'గోపాల గోపాల' సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి పవన్ కళ్యాణ్ కోసం ఓ బైక్‌ను ప్రత్యేకంగా తయారు చేయించిన విషయం విదితమే. ఇదే బైక్‌ను కన్నడలోనూ సుదీప్ ఉపయోగించాడు. ఇటీవలే ఎనిమిది లక్షలు ఇచ్చి దానిని సొంతం చేసుకున్న నిర్మాతలు బైక్‌పై రైడింగ్ సీన్స్‌ను సైతం చిత్రీకరించేశారట.

    నచ్చుతుందనే

    నచ్చుతుందనే

    ముకుందా మురారి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లిమెటెడ్ బడ్జెట్ లో పూర్తి ఫన్ తో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. తన అబిమానులకు తను కృష్ణుడుగా కనిపించటం నచ్చుతుందని బావించి సినిమా చేసాడు.

    మార్పులు చేసి..

    మార్పులు చేసి..

    పవన్ కళ్యాణ్ సినిమా అనుకుని వస్తే ఆయన గెస్ట్ రోల్ లో కనిపించినట్లైంది. దాంతో ఫ్యాన్స్ నిరాస చెందారు. అలాంటి పొరపాటు కన్నడంలో జరగకూడదని సుదీప్ భావించి స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    ఓపినింగ్స్ కేక

    ఓపినింగ్స్ కేక

    ఇక ఈ చిత్రం ఓపినింగ్స్ అద్బుతంగా ఉంటాయని అక్కడ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుదీప్, ఉపేంద్రలకు విడివిడిగా అద్బుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అది ఓపినింగ్స్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. అదే సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు.

    సాయి కుమార్ సోదరడు

    సాయి కుమార్ సోదరడు

    హిందీ, తెలుగులో చేసిన మిధున్ చక్రవర్తి పాత్రను యాజటీజ్ గా సాయికుమార్ తమ్ముడు దింపేయటం మీరు ట్రైలర్ లో గమనించవచ్చు. సీన్స్, డైలాగ్స్ పెద్దగా మార్పు లేవని మనకు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. సుదీప్, ఉపేంద్ర కెమెస్ట్రీ బాగా పండిందని అంటున్నారు.

    మాస్ లోకి వెళ్లలేదు

    మాస్ లోకి వెళ్లలేదు

    హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది. అయితే దురదృష్టవశాత్తు రకరకాల కారణాలతో యావరేజ్ కారణాలతో నిలిచింది. క్లాస్ ఏరియాల్లో బాగానే ఉన్నా...మాస్ సెంటర్లలో అసలు వర్కవుట్ కాకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం మిగిల్చిందని చెప్తున్నారు. 42.35 కోట్ల రూపాయలు క్లోజింగ్ బిజినెస్ గా వచ్చింది.

    ఇదే కథ

    ఇదే కథ

    దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు.

    దేముడి ప్రతినిధులమని

    దేముడి ప్రతినిధులమని

    ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

    ఎవరు నా నష్టం

    ఎవరు నా నష్టం

    దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు.

    ఆ సమస్యలనుంచి భగవంతుడే

    ఆ సమస్యలనుంచి భగవంతుడే

    మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

    ఈ సాంగ్ ప్రోమో పెద్ద హిట్

    ఈ సాంగ్ ప్రోమో కన్నడంలో మంచి విజయం సాధించింది.

    English summary
    Mukunda Murari movie is remake version of Bollywood superhit movie Oh My God and it is a comedy entertainer movie in which, Upendra and Sudeep along with Nikitha are playing the main lead roles. Nanda Kishore directed this movie under MN Kumar's production banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X