వరుణ్ తేజ్ ‘ముకుంద’(థియేట్రికల్ ట్రైలర్ అదిరింది)
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ముకుందా'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. సినిమాపై అంచనాలు మరింత పెంచే విధంగా ఉన్న ఈ ట్రైలర్ పై మరూ ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు. ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఆడియోకు, వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.


Click it and Unblock the Notifications











