మామా అల్లుళ్ల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ... హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో దర్శకుడు

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల శకం నడుస్తోంది. ఆ క్రమంలో విక్టరీ హీరో వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్యల కంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

By Rajababu

Recommended Video

Nagachaitanya And Venkatesh Pairing For Multistarer Movie

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల శకం నడుస్తోంది. ఆ క్రమంలో విక్టరీ హీరో వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగ చైతన్యల కంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కళ్యాణ కృష్ణ ఇప్పటికే మన్మధుడు నాగార్జునతో సోగ్గాడే చిన్నా నాయన, ఆయన కుమారుడు నాగ చైతన్య హీరోగా రారండోయి వేడుక చూద్దాము చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

మూచ్చటగా మూడో చిత్రం....

మూచ్చటగా మూడో చిత్రం....

ఆయన దర్శకత్వం వహిస్తున్న ముచ్చటగా మూడో చిత్రాన్ని భారీగా మల్టీ స్టారర్ లతో నిర్మించాలనుకున్నారు. అందుకు తగిన కథను సిద్ధం చేసుకుని హీరోలు వెంకటేష్, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవకొండలను కలిశారు. అయితే ఆ కథ వెంకటేష్, నాగ చైతన్యలకు బాగా నచ్చింది. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో నటించేందుకు వారిద్దరు వెంటనే అంగీకరించారని సమాచారం.

గతంలో వెంకీ, చైతూ....

గతంలో వెంకీ, చైతూ....

కాగా ప్రేమమ్ చిత్రంలో మేనమామ మేనల్లుడు వెంకటేష్, నాగ చైతన్యలు కొన్ని నిమిషాలు కనిపించిన సంగతి విధితమే. ఇంతకు ముందు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్నా నాయన, రారండోయి వేడుక చూద్దాం చిత్రాలు బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కలియికలో వచ్చే చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల నుంది.

హ్యాట్రిక్ దిశగా...

హ్యాట్రిక్ దిశగా...

కళ్యాణ్ దర్శకత్వంలో హీరో నాగ చైతన్య నటిస్తున్న ఈ చిత్రం రెండోవది. ముచ్చటగా మూడో చిత్రం కూడా హీట్ కోట్టాలని కసితో ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ... వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

కథ అందించిన మహార్షి...

కథ అందించిన మహార్షి...

వెంకీ, చైతూ కలసి నటించే ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత జనార్దన్ మహార్షి కథను అందజేస్తున్నారు. పవర్ ఫుల్ కథను తీర్చిదిద్దిన జనార్దన్ మహర్షికి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్ లో చకర్లు కొడుతుంది. అంతేకాకుండా స్టోరీ రైట్స్ లో ఆయనకు వాటా కూడా ఇచ్చారనే విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

తర్వాత మారుతితో...

తర్వాత మారుతితో...

ఇది ఇలా ఉండగా, నాగ చైతన్య మరో చిత్రంపై కూడా నజర్ పెట్టినట్లు సమాచారం. దర్శకుడు మారుతితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని తెలుస్తుంది. సమంతతో వివాహం తర్వాత దీనిపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X