వెంకీతో కలసి వరుణ్ తేజ్ ప్రయోగం.. అదేదో ఎఫ్2 అంట, దాని మీనింగ్!
Recommended Video

వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస రెండు సూపర్ హిట్స్ తో వరుణ్ తేజ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. వరుణ్ తదుపరి నటించే చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఇక వెంకటేష్ కూడా విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తేజ దర్శత్వంలో వెంకీ నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా మెగా ప్రిన్స్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో భారీ మల్టి స్టార్టర్ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉగాదికే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

క్రేజీ హీరోగా మారిపోయిన మెగా ప్రిన్స్
ఫిదా, తొలిప్రేమ చిత్రాలు వరుసగా విజయాలు సాధించడంతో వరుణ్ తేజ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ రెండు చిత్రాలు రొమాంటిక్ హిట్స్ గా నిలిచాయి.

స్పేస్ మూవీతో
రొమాంటిక్ చిత్రాలతో విజయం అందుకున్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రం కూడా అదేతరహాలో ఉంటుందని భావించిన వారికీ షాక్ ఇచ్చాడు. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాను ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సిద్ధం అని ఇలా సంకేతాలు పంపాడు.

చాలా కాలం తరువాత ఉపాధ్యాయుడిగా
విక్టరీ వెంకటేష్ కూడా ఎక్కువగా విభిన్న కథలవైపు ఆసక్తి చూపుతుంటారు. గతంలో పలు చిత్రాల ద్వారా వెంకీ ఈ విషయాన్ని నిరూపించాడు. వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శత్వంలో ఆటా నాదే వేటా నాదే చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ చాలా కాలం తరువాత ఉపాధ్యాయుడు పాత్రలో కనిపించబోతున్నాడు. సుందరకాండ చిత్రంలో లో వెంకటేష్ ఉపాధ్యాయుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.

ఇద్దరూ కలసి షాక్ ఇచ్చారు
కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో భారీ మల్టి స్టారర్ చిత్రం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ఉగాది రోజే ముహూర్తం అట. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

టైటిల్ ఎఫ్ 2
ఈ చిత్రానికి ఎఫ్ 2 అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎఫ్ 2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్. పూర్తి వినోదాత్మకభరిత చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

వరుస హిట్లతో జోరు
దరకుడు అనిల్ రావిపూడి వరుస హిట్లతో జోరుమీద ఉన్నాడు. వినోదాత్మకభరిత చిత్రాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకమైన శైలిని అవలంభిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన పటాస్ చిత్రం నుంచి రాజా ది గ్రేట్ చిత్రం వరకు అన్ని కమర్షియల్ గా విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











