మల్టీస్టార్ సినిమాలు చేయడమంటే ఆషామాషి కాదు: మహేష్ బాబు
సూపర్ స్టార్ 'ప్రిన్స్" మహేష్ బాబు కి ఎక్కువగా బయట తిరగడం..మీడియాలో 'నానడం" అస్సలు ఇష్టముండదు. అందుకే తనెక్కడా బయట కనిపించాడు…ఏ కార్యక్రమాలకి హాజరవడు. 'చిన్నప్పటి నుండి నేనలాగే పెరిగాను. నిరాడంబరమైన జీవితాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను" అని మహేష్ అంటున్నాడు.
నేను నటించే యాడ్ కంపెనీలు నిర్వహించే కార్యక్రమాల ద్వారా అభిమానులను కలవడం అంటే నాకిష్టం. ఈ మధ్యే 'ట్విట్టర్" లో కూడా అకౌంట్ ఓపెన్ చేసి అభిమానులతో నిత్యం నా ఆలోచనలని…కొత్త కొత్త విశేషాలని పంచుకుంటూనే ఉన్నాను. అలాగని గంటల తరబడి ఇంటర్నెట్ కి ఆతుక్కుపోవాలంటే మాత్రం మనకు కుదరని పని" అని అన్నాడు మహేష్.
తన తండ్రి కృష్ణతో సినిమా చేసే విషయమై మహేష్ ని అడిగితే" మల్టీస్టారర్ సినిమాలు చేయడమంటే అంత ఆషా మాషీ కాదు. అయినా మా ఇద్దరికీ తగ్గ మంచి స్ర్కిప్ట్ ముందు దొరకాలి కదా" అని స్పందించాడు. ఇక తన ముద్దుల కుమారుడు గౌతమ్ తో కలిసి ఏదైనా సినిమా చేస్తారా అని ప్రశ్నిస్తే… బిగ్గరగా నవ్వుతూ" వాడు ఇంకా చిన్న పిల్లాడే…. ప్రస్తుతానికి అలా ఒంటరిగా వదిలేయండి" అంటూ బదులిచ్చాడు ప్రిన్స్. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పాటల నిమిత్తం ముంబైలో ఉన్నారు మహేష్ బాబు. అహ్మద్ అనే కొరియోగ్రాఫర్ ఈ పాటలకు పనిచేస్తున్నారు


Click it and Unblock the Notifications











