twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు లక్షల మందికి ఉపాధి.. ఆ దేశాల మాదిరి అనుమతివ్వాలని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ లేఖ

    |

    కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది. కరోనా కారణంగా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. నేటికీ కొంత మంది ఇంకా ఉపాధి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కరోనా వల్ల ఎన్నో రంగాలు వెనుకబడ్డాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినీ పరిశ్రమ, థియేటర్ వ్యవస్థ. ఇప్పటికీ థియేటర్లు కరోనా దెబ్బకు కోలుకోలేకపోతున్నాయి. తాజాగా మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విన్నవించుకుంది.

    కరోనాతో పూర్తిగా..

    కరోనాతో పూర్తిగా..

    థియేటర్, మల్టీ ప్లెక్స్ రంగాలు కరోనాతో పూర్తిగా నష్టాల భారిన పడ్డాయి. మూడు నెలల నుంచి థియేటర్లు మూత పడి ఉంటడంతో ఎందో మందికి ఉపాధి కరువైంది. మునుపటిలా థియేటర్లు కళకళలాడే పరిస్థితి లేకపోయినా.. కనీసం థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరింది.

    షూటింగ్‌లకు అనుమతి..

    షూటింగ్‌లకు అనుమతి..

    కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడిలింపులతో ఆయా రాష్ట్రాలు సినిమా, సీరియల్ షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. కానీ థియేటర్లు ఓపెన్ చేయడానికి మాత్రం కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ మేరకు మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా బహిరంగ లేఖను విడుదల చేసింది.

    రెండు లక్షల మందికి ఉపాధి..

    రెండు లక్షల మందికి ఉపాధి..


    ఆ లేఖలోని సారాంశం.. కేంద్రప్రభుత్వం అన్‌ లాకింగ్‌ 2.0 గైడ్‌లైన్స్‌లో కూడా థియేటర్స్‌ను రీ ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించలేదు. నిజానికి సామాజిక దూరం, క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయడం వంటి అంశాలను థియేటర్స్‌ యాజమాన్యం సమర్థవంతంగా నిర్వహించగలదని మేం నమ్ముతున్నాం. దేశవ్యాప్తంగా మా ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలల్లో ఉపాధి పొందుతున్నారు.

    ఎన్నో సవాళ్లున్నాయి..

    ఎన్నో సవాళ్లున్నాయి..

    థియేటర్స్‌ మూసివేయడం వల్ల మా నష్టం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులు కూడా పెరుగుతు న్నాయి. నిజానికి మేం థియేటర్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ మునుపటి రోజులు రావటానికి సమయం పడుతుంది. మరోవైపు ప్రేక్షకులను థియేటర్స్‌కు ఆకర్షించే కంటెంట్‌పైనా దృష్టి పెట్టాలి. ఇటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి. కానీ ఈ చాలెంజెస్‌ను ప్రభుత్వ ప్రోత్సాహంతో అధిగమిస్తామని నమ్ముతున్నాం.

    ఆ దేశాల మాదిరి..

    ఆ దేశాల మాదిరి..

    ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, హాంకాంగ్, ఇటీవల బెల్జియం, మలే షియా వంటి దేశాల్లో సినిమాల ప్రదర్శనలకు నియంత్రణలతో కూడిన అవకాశం కల్పించారు. ఇతర సెక్టార్స్‌లోని వాటికి అనుమతులు ఇచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా నాన్‌ కంటైన్మెంట్‌ జోన్స్‌లో సినిమాల ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరు కుంటున్నామ'ని చెప్పుకొచ్చింది. మరి వీరి విన్నపాన్ని కేంద్రం ఆలకిస్తుందో లేదో చూడాలి.

    English summary
    Multiplex Association Request To central Government To Re Open Theaters. MAI issued a statement and said that it is disappointed over the Centre's decision to keep cinemas and multiplexes shut Down.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X