నవదీప్ సినిమాలు వద్దంటున్న మల్టీప్లెక్స్‌లు
హీరో నవదీప్ సినిమాలు ఇకపై మల్లీప్లెక్స్ థియేటర్లలో కనిపించవు. ఈ యువ హీరో సినిమాలను తమ థియేటర్లలో ఆడించి నష్ట పోవడం కంటే, తిరస్కస్తేనే మేలని మల్టీప్లెక్స్ యజమానులు భావించడమే ఇందుకు కారణం. గతంలో విడుదలైన నవదీప్ సినిమాల వల్ల వారు తీవ్ర నష్టాల పాలయ్యారు. అందుకే నవదీప్ తాజా సినిమా 'ఆకాశమే హద్దు" మల్టీ ప్లెక్స్ లకు దూరం అయినపట్లు స్పష్టం అవుతోంది.
మల్టీప్లెక్స్ యజమానుల నిర్ణయం నేపథ్యంలో...నవదీప్ తన ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించాడు. ఇంత పెద్ద హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి..కానీ ఏం లాభం? ఇలా అయితే ప్రజలు అక్కడికి వెళ్లడానికి ఎలా ఇష్టపడతారు అంటూ మండి పడ్డాడు.
ఇలా మండి పడటం మాని మల్టీ ప్లెక్స్ థియేటర్ల యజమానులు తన సినిమాలు ఎందుకు ఆపారో అనే విషయంపై దృష్టి పెట్టి లోపాలను సవరించుకోవాలే గానీ, ఇలా అడ్డదిడ్డంగా అరిస్తే ఏమిటి లాభం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











