రెచ్చిపోయిన సెక్సీ భామ (వీడియో)
హైదరాబాద్ : మర్చిపోయిన ఆడియన్స్ ను మళ్లీ తన దారికి తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేసి ఎట్రాక్ట్ చేయాల్సిందే. అది వాలంటరీ రిటైర్ మెంట్ తరహాలో ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ముమైత్ ఖాన్ కు బాగా తెలిసినట్లుంది. ఆమె తాజాగా ఓ పాప్ ఆల్బమ్ తో మన ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఓ వీడియోని కూడా వదిలి తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో చూసిన వారు సెక్స్ బాంబ్ గా వెలిగిన ముమైత్ మళ్లీ తన పాత ప్రాభవంతో రెచ్చిపోయింది అంటున్నారు. మీరు కూడా ఆ వీడియో చూడండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/8THLnjHzvrA" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇప్పటి వరకు ఐటం గర్ల్ గా వివిధ సినిమాల్లో నటించిన ముమైత్ ఖాన్ కొత్త అవతారం ఎత్తింది. సింగర్ గా మారి 'అడిక్షన్' పేరుతో వీడియో ఆల్బం రూపొందించింది. తాజాగా 'అడిక్షన్' వీడియో ఇంటర్నెట్లో విడుదలైంది. తెలుగు, ఇంగ్లిష్ లిరిక్స్ మిక్స్ చేసి ఈ ఆల్బం రూపొందించారు. ఈ సింగిల్ ఆల్బం కోసం ఆమె డిజె షెయిజ్వుడ్ తో కొలాబరేట్ అయ్యారు.
ఈ వీడియో ఆల్బంకు సైకోటిక్ బ్రదర్స్ దర్శకత్వం వహించగా లాఫింగ్ కలర్స్ మ్యూజిక్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఆగస్టు 5న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో ఆల్బం విడుదల చేసారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో ఈ వీడియో ఆల్బం రూపొందించడం విశేషం. ఇంటర్నెట్లో ఈ వీడియో ఆల్బంకు మంచి స్పందన వస్తోంది. ముమైత్ ఖాన్ సింగింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా మ్యూజిక్ కూడా పర్ ఫెక్టుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

2013లో కెవ్వు కేక సినిమాలో తళుక్కుమన్న ముమైత్ ఆ మధ్య సినిమా నిర్మాణం, స్టేజ్ షోల కోసం ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలు పెట్టింది. కొంత విరామం తర్వాత తాజాగా హైదరాబాద్‌లో ఓ అందాల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ డ్యాన్స్‌తో పాటు పాట పాడుతూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచింది. డ్యాన్స్‌తో పాటు తనకు పాడడం ఇష్టం అంటూ ఫేమస్ పాప్ సింగర్స్ షకీరా, బియాన్స్‌లాగా పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నానంటూ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి పాడిన ఆ పాటను "అడిక్షన్" పేరుతొ త్వరలో ఆల్బమ్‌గా రిలీజ్ చేసింది.


Click it and Unblock the Notifications











