ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అదుర్స్!!!
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే-ఐటమ్ గాళ్ ముమైత్ ఖాన్ కు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి. ఎలా తెలుసంటారా...ఆమె ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లింది. స్టేజీ మీద ఎంపీ హర్షకుమార్ ఉండగానే మైక్ అందుకొనే తన ఫేవరైట్ పాటలను అలా హమ్ చేసిందో లేదో అంతే విద్యార్థులు కాదు...కాదు...ముందు వరుసలో ఉన్న విద్యార్థినిలు రెచ్చిపోయి డాన్స్ లు చేశారు. మా వయసు కూడా 16 అంటూ గెంతులు వేశారు. స్టేజీ వైపుకు దూసుకు వచ్చారు. ఈలలు వేశారు. ముమైత్ నే హడలగొట్టారు. అదీ ముమైత్ డాన్స్ పవర్. ప్రస్తుతం ముమైత్ గోదావరి జిల్లాలలో సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











