ముమైత్ ఖాన్ తో...రాఖీ సావంత్ తమ్ముడు బిజినెస్

By Srikanya

హైదరాబాద్ : సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ తమ్ముడు రాకేష్ సావంత్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ముమాయిత్ ఖాన్ ని ముందు పెట్టి తెలుగులో తన తాజా చిత్రం బిజినెస్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ముమైత్ ఖాన్ పై ఓ ఐటం సాంగ్ ని షూట్ చేసారు. బిజినెస్ పరంగా ముమైత్ కు ఉన్న క్రేజ్ తో ట్రేడ్ లో ఈ చిత్రాన్ని అమ్మాలని చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఫేడ్ అవుట్ అయిపోయిన ముమైత్ కి అంత సీన్ ఉందా లేదా అన్నది తేలాలి.

వివరాల్లోకి వెళితే...ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో తమిళం లో రూపొందిన అమావాస్య చిత్రాన్ని ఆదివారం అమావాస్య పేరుతో తెలుగు పునర్ నిర్మిస్తున్నారు. రాకేష్ సావంత్ దర్శకుడిగా జై ఆకాష్ ఇందులో హీరోగా నటించారు. ఈచిత్రం కోసం ఇటీవల 40మంది డాన్సర్స్ 200మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ముమైత్ ఖాన్ పై ఓ ఐటం సాంగ్ చేశారు.

Mumaith Khan in Aadivaaram Amavasya

ఈ సినిమా విడుదలైన తరువాత ముమైత్ ఖాన్ కు మళ్ళీ మునుపటి వైభవం వస్తుందనడంలో సందేహం లేదు. దర్శకుడిగా నాకు కూడా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది అన్నారు దర్శ్డకుడు రాకేష్ సావంత్. ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో శ్రావణ్, జీవా, రాకేష్ వివేక్, తదితరులు నటిస్త్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతః కె.కె. అగర్వాల్, ఎడిటర్:అనిల్ బొంతు, ఫైట్స్:బాచి, సంగీతం: సయ్యద్ అహ్మద్, రచనః దిలీప్ మిశ్రా-రాకేష్ సావంత్, కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: రాకేష్ సావంత్.

"ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ "పోకిరీ" లో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన ముమాయిత్ ఖాన్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ మధ్య కాలంలో వేషాలు కరువైన ఈ ఐటం సుందరి...తన ఉనికిని,ప్రాభవాన్ని తెలుగు పరిశ్రమ మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన 'నేను ...నా రాక్షసి' లో ఆమెను నెగెటివ్ పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత మెల్లి మెల్లిగా డిజాల్వ్ అవటం మొదలైంది. ఇప్పుడు మళ్ళీ ఓ ఐటం సాంగ్ లో కనిపించి అలరించటానికి ప్రయత్నం చేయబోతోంది. దాంతో ఆమె మళ్లీ బిజీ అవుతుందంటున్నారు.

సెక్సీ ఒంపు సొంపులతో, కైపెక్కించే ఒయ్యారాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేసిన ఈ భామ మళ్లీ తన అభిమానులను అలరించటానికి రెడీ అవుతోంది. ఆమె ఓ పాప్ ఆల్బమ్ ని రిలీజ్ చేస్తోంది. ఆ ఆల్బమ్ పేరు ఎడిక్షన్. ఈ పాప్ ఆల్బమ్ లో పాటలు ఆమే పాడింది. అవి తెంగ్లీష్(తెలుగు,ఇంగ్లీష్ కలిపి) ఉండనున్నాయి. వచ్చే నెల రెండో వారంలో ఈ ఆల్బం ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆల్బమ్ లో భాగంగా స్టేజ్ ఈవింట్స్ కూడా కండక్ట్ చేయనుందని తెలుస్తోంది. దీంతో తనను తాను మళ్లీ ఆవిష్కరించుకుని, సినిమాల్లో బిజీ అవ్వాలనే ఆలోచనగా చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X