ఆ విషయాలు గుర్తు చేసి మరీ.. ముమైత్ ఖాన్‌ను ఏడిపించిన అలీ
ముమైత్ ఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు రకరకాల అభిప్రాయాలుంటాయి. కొందరు ఐటం సాంగ్స్ చేస్తుందని అంటుంటారు.. ఇంకొందరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొందని అంటుంటారు. మొన్నా మధ్య క్యాబ్ డ్రైవర్ వివాదం ఇలా ముమైత్ ఖాన్ అంటే ఎన్నో గుర్తుకువస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా బిగ్ బాస్ షో తరువాత ముమైత్ ఖాన్ మీద కాస్త పాజిటివ్ ఇమేజ్ ఏర్పడింది. అలాంటి ముమైత్ ఖాన్ తన జీవితంలోని ఓ చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు వెండితెరపై..
ముమైత్ ఖాన్ ఒకప్పుడు వెండితెరను ఊపు ఊపేసింది. ఐటెం సాంగ్స్ చేస్తూనే సైడ్ ఆర్టిస్ట్‌గా నటించింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మాస్ ప్రేక్షకుల్లో ముమైత్ ఖాన్‌కు వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ముమైత్ ఖాన్‌కు వెండితెరపై అంత క్రేజ్ లేదు.

బుల్లితెరపై రచ్చ..
ప్రస్తుతం ముమైత్ ఖాన్‌కు బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో తరువాత ముమైత్ ఖాన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే ముమైత్‌ను మళ్లీ ఓ షోలోకి తీసుకున్నారు. డ్యాన్స్ ప్లస్ అంటూ వస్తోన్న షోలో ముమైత్ ఖాన్ ఓ జడ్జ్‌గా చేస్తోంది. అయితే తాజాగా ముమైత్ తన గతం గురించి చెప్పి ఏడిపించింది.

అలీతో అలా..
తాజాగా ముమైత్ ఖాన్ అలీతో సరదాగా అనే షోలో గెస్ట్‌గా పాల్గొంది. ఇక ముమైత్ ఖాన్ అలీతో కలిసి ముచ్చట్లు పెట్టేసింది. సినిమా సంగతులు, వ్యక్తిగత విషయాలన్నీ కూడా పంచుకుంది. అందులో భాగంగా తాను కోమాలో ఉన్న విషయం, నాడు జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

మొదటిసారిగా..
ముమైత్ ఖాన్ గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆమె కోమాలో ఉందని, మూడేళ్లు లేవలేని పరిస్థితిలోకి వెళ్లిందని ఎవ్వరికీ అంతగా తెలియదు. కానీ మొదటిసారిగా ఈ విషయం గురించి ముమైత్ ఖాన్ బయటకు చెప్పింది.

ఆ మూవీ షూటింగ్..
డిక్టేటర్ మూవీ సినిమాలో భాగంగా శ్రద్దాదాస్‌తో కలిసి షూటింగ్ చేస్తోన్న సమయంలో ఇటాలియన్ మార్బల్స్ ఉండటం వల్ల కాలు జారి పడ్డానని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలిందని, రెండు రోజులు తల నుంచి రక్తం కారుతూనే ఉందని చెప్పుకొచ్చింది. పది హేను రోజులు కోమాలో ఉన్నాను.. మూడేళ్లు విరామం తీసుకోవాలని చెప్పారు.. కానీ నేను మూడు నెలలకే పని చేయడం మొదలుపెట్టేశానని చెబుతూ ఎమోషనల్ అవుతూ కన్నీరుపెట్టేసింది.


Click it and Unblock the Notifications











