ఐటమ్ సాంగ్ తో మొదలైన ముమైత్ ఖాన్ కెరీర్ ప్రస్ధానం ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల దాకా వెళ్ళింది. ఇక అక్కడితో ఫుల్ స్టాప్ అనుకునే వారికి జలక్ ఇచ్చేలా ఇతర భాషల్లోనూ బిజీ అవుతోంది. తాజాగా ఆమెకు కన్నడ పరిశ్రమ నుండి వరస ఆఫర్లు వస్తున్నాయిట. అక్కడా ఆమె అభిమాన నిర్మాతలు పెర్గిపోయారట. అక్కడామె ఐటం సాంగ్ కోసం ఐదు లక్షలు ఆఫర్ చేస్తూంటే కాదని ఎనిమిది అనే స్ధితికి వచ్చిందిట. ఆమె డిమాండు చూసి అక్కడ పేరున్న హీరోయిన్లు నోరు వెళ్ళ బెట్టి చూస్తున్నారుట. అలాగే ఇప్పటికే అక్కడ పాతుకుపోయి యోలుతున్న కన్నడ ఐటం బాంబులయితే ముమైత్ తమ సినిమాల్లోకి ఎంటర్ అయితే తమకు చుక్కరెదురవుతుందని బెంగపెట్టుకున్నారట. అలా అన్నిచోట్లా సంచలనాలు సృష్టిస్తున్న ముమైత్ ప్రస్తుతం 'టార్గెట్' సినిమా చేస్తోంది. 'బేసిక్ ఇన్ స్టెంట్' ఆధారంగా వస్తున్న ఈ సినిమా లో స్టిల్స్ చాలా హాట్ గా ఉండి ఇప్పుటికే మార్కెట్ లో ఆసక్తి రేపుతున్నాయి.