షకీలా, అల్లు అర్జున్ లు నడచిన బాటలో ముమైత్ ఖాన్..!!
ఒకప్పుడు మళయాల సినీ ఇండస్ట్రీని తన హాట్ సినిమాలతో షకీలా ఓ ఊపు ఊపింది. ఓ సమయంలో ఆమె సినిమాలు విడుదల అవుతుంటే స్టార్ హీరోలయిన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారు వారి సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారంటే ఆమె ఏ రేంజిలో భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె ఇకపై హాట్ చిత్రాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాకా, మళయాల హీరోలు ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఇటీవల టాలీవుడ్ యూత్ హీరో అల్లు అర్జున్ మళయాల హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట. కారణం అల్లు అర్జున్ నటించిన ప్రతీ సినిమా మళయాలంలో సూపర్ హిట్ అవుతోందట, అదీ స్థానికి స్టార్ హీరోల సినిమాల వసూళ్లను తలదన్నే విధంగా ఈ సినిమాలు వసూళ్లు సాధిస్తున్నాయట. ఇటీవలే మళయాలంలో విడుదలయిన ఆర్య-2 సినిమా వసూళ్లలో రికార్డులను సృష్టిస్తోందట. దీంతో మరో సారి మళయాల హీరోలకు తలనొప్పి మొదలయింది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మళయాల నాయకులకు మరో షాకింగ్ న్యూస్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఐటెం సాంగులు చేసుకుంటున్న ముమైత్ ఖాన్ త్వరలో మళయాలంలో ఓ బూతు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపిందని సమాచారం. దీంతో ఈమె షకీలా స్థానాన్ని భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. మరి ముమైత్ కూడా షకీలా మాంచి రసికురాలని పేరు తెచ్చుకుంటే ఇక మళయాల హీరోలకు కష్టమే..!!


Click it and Unblock the Notifications











